హైదరాబాద్ మెట్రో రైలు కోసం ఇక వేచిచూడక్కర్లేదు

కారిడార్ 1లో మెట్రో రైలు కోసం ఇక వేచిచూడక్కర్లేదు

Last Updated : Sep 8, 2019, 12:45 PM IST
హైదరాబాద్ మెట్రో రైలు కోసం ఇక వేచిచూడక్కర్లేదు

హైదరాబాద్‌: హైదరాబాద్ మెట్రో రైళ్లలో అంతకంతకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్... రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచి రైళ్ల రాకపోకల కోసం ఎక్కువసేపు వేచిచూడాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. ఇప్పటివరకు ఎల్‌బీనగర్‌ - మియాపూర్ కారిడార్ -1 మార్గంలో చివరి స్టేషన్‌కి వచ్చే రైలు ఒక ట్రాక్‌ మీద నుంచి మరోట్రాకు మీదకు రావాలంటే మెట్రో స్టేషన్‌ దాటిన తర్వాత అక్కడున్న రివర్స్‌ ట్రాక్‌ ద్వారా మళ్లీ వెనక్కి వచ్చి రెండో ట్రాక్‌ మీదకు వచ్చేది. దీంతో రైలు తిరిగి ట్రాక్ మీదకు రావడానికి సుమారు 5-7 నిమిషాల సమయం పట్టేది. అయితే, తాజాగా చివరి మెట్రో స్టేషన్‌లో రైలు వెంటనే మలుపు తిరిగి మరో ట్రాక్‌పైకి వచ్చేలా క్రాస్ లైనింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులకు ఇకపై అంతగా వేచిచూడాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్క నిమిషంలోనే రైలు వెనక్కి తిరిగొస్తుంది.

ఇదిలావుంటే, కారిడార్‌-2లోనూ చివరి స్టేషన్‌ల వద్ద జరుగుతున్న ఆలస్యంపై దృష్టిసారించామని.. కారిడార్‌-1 లాగే చివరి స్టేషన్లలో రైలు వెంటనే తిరిగొచ్చేలా చర్యలు చేపట్టనున్నట్టు మెట్రో అధికారులు తెలిపారు.

Trending News