TS Medical staff recruitment notification:హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో కరోనా రోగుల తాకిడిని తట్టుకోలేక ఆస్పత్రులు సైతం చేతులెత్తేసే పరిస్థితి తలెత్తింది. కరోనా రోగులకు తగినంత ఆక్సీజన్ నిల్వలు, రెమ్డిసివిర్ ఇంజెక్షన్స్ (Remdesivir injection) లేకపోవడం అందుకు ఓ కారణమైతే.. అసలు రోగుల సంఖ్యకు సరిపడే స్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది.
Petlaburj Maternity Hospital | హైదరాబాద్: పేట్ల బురుజు మెటర్నటీ హాస్పిటల్లో 32 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి కరోనా సోకడం కలకలం సృష్టించింది. కరోనావైరస్ సోకిన వారిలో 14 మంది డాక్టర్లు, 18 మంది ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు( Doctors tested positive). తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా ఒకే ఆస్పత్రిలో ఇంత మందికి కరోనావైరస్ సోకడం ఇదే తొలిసారి
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో పనిచేస్తోన్న సిబ్బందిలో 33 మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిందనే వార్త నుంచి వైద్య ప్రపంచం ఇంకా తేరుకోకముందే తాజాగా ఢిల్లీలోనే మరో షాకింగ్ న్యూస్ వెలుగుచూసింది. జగ్జీవన్ రామ్ ఆస్పత్రిలో మంగళవారం 77 మందికి కరోనా సోకినట్టుగా తేలింది.
ఆస్పత్రులలో పనిచేస్తోన్న వైద్య సిబ్బందిలో కొన్ని చోట్ల, కొంతమంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రిలో 30 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిన నేపథ్యంలో అదే ఆస్పత్రికి చెందిన మరో 39 మంది సిబ్బందిని క్వారంటైన్‌కి తరలించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.