ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎన్నికల నగారా మ్రోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ విడుదల చేశారు. మొత్తం రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 9, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 18న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 50 వేల 128 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 4.33 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఈ సారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీ పాట్ లను వినిగిస్తున్నట్లు సీఈసీ వెల్లడించారు. 2018 జనవరి 22 నాటికి గుజరాత్ అసెంబ్లీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.