sikkim govt action against lazy govt employees: కొన్నిసార్లు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను అభినందించకుండా ఉండలేం. వ్యవస్థలో ఉండే జాడ్యాన్ని పోగొట్టడానికి.. ధైర్యంగా తీసుకునే కఠిన నిర్ణయాలకు శభాష్ చెప్పడం తప్పేంకాదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకొని జనంతో చప్పట్లు కొట్టించుకుంటోంది సిక్కిం సర్కార్.
Madras High Court on mobile usage in offices: తిరుచిరాపల్లిలోని హెల్త్ రీజనల్ వర్క్‌షాప్ విభాగంలో సూపరిండెంట్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల ఆఫీసులో సహచర ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో తరచూ మొబైల్ వినియోగిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది.
Telangana Govt: రాష్ట్రప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Dalita Bandhu scheme benefits will be given to govt employees in dalits: హుజూరాబాద్: దళిత బంధు పథకం ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు పథకం ప్రయోజనాలను నిరుపేద దళితులతో పాటు దళితులలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance), డీఆర్ పెంపు వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిన్నర కాలం నుంచి ఆరు నెలలకు సవరించే తమ డీఏ, డీఆర్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం పెరిగే ధరలకు అనుగుణంగా తమ డీఏ పెంపు, డీఆర్ సవరింపు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
PRC approved for TS govt employees and pensioners: హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 9,21,037 మంది ఉద్యోగులు, పింఛనుదారులకు (Govt employees and pensioners) ప్రయోజనం కలగనున్నట్టు తెలంగాణ సర్కారు తెలిపింది.
New take home salary structure: వేతన జీవులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుండగా, అదే రోజు నుంచి కొత్త వేజ్కోడ్ కూడా అమలులోకి రానున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 1 నుంచే New wage code అమలు చేయడం లేదని కార్మిక మంత్రిత్వ శాఖకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్టుగా ఎకానమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.
7th Pay Commission Latest News: ఉద్యోగులు దీపావళి పండుగ తర్వాత రెండో పండుగ చేసుకోబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పలు జాతీయా మీడియాల కథనాలు ప్రకారం.. డిసెంబర్ నెలలో జీతాలు పెరగనున్నాయి.
Diwali bonus to govt employees: లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( UP CM Yogi Adityanath ) శుభవార్త చెప్పారు. అన్ని శాఖలు, విభాగాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14.82 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించారు. దీపావళి బోనస్‌లో 75 శాతం మొత్తం ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ( EPFO ) జమ కానుంది.
COVID-19 in AP| అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మున్ముందు కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏపీ సర్కార్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పరిశ్రమల శాఖ పరిధిలోని ఉద్యోగులకు ఇంటి నుంచే పని ( Work from home ) చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ అదేశాలు జారీ చేశారు.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ( AP secretariat employees ), హైదరాబాద్‌లోనే కుటుంబాలతో కలిసి ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తిరిగి అమరావతి చేరేందుకు మార్గం సుగమం అయింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రభుత్వాలకు పన్ను, ఇతరత్రా రూపంలో వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనికితోడుగా కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం తీసుకుంటున్న చర్యలకు నిధుల విడుదల చేయాల్సి ఉండటంతో ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.
కరోనావైరస్ లక్షణాలు ఉన్న అనుమానితులను నిర్దేశిత ఆస్పత్రులకు తీసుకెళ్లడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఫలితంగా వైరస్ వ్యాపించే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ ఓ కొత్త పరిష్కారాన్ని కనుగొంది. ఇకపై అనుమానితులు తమ శాంపిళ్లు ఇవ్వడానికి ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇళ్ల వద్దకే ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి బ్లడ్ శాంపిల్స్ సేకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చిత్తశుద్ధితో సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్, పంచాయతీ కార్మికులు అలాగే జీహెచ్ఎంసి, హెచ్ఎండబ్లూఎస్ విభాగాల సిబ్బందికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ రూపాల్లో గుడ్ న్యూస్ అందించారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 45 మందిని డిశ్చార్జ్ చేశామని.. మరో 11 మంది చనిపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రస్తుతానికి 308 మంది బాధితులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు.
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ అహర్నిశలు సేవలు అందిస్తోన్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి, పోలీసు శాఖ సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.