Flash: వైద్య సిబ్బంది, పోలీసులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ అహర్నిశలు సేవలు అందిస్తోన్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి, పోలీసు శాఖ సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు.

Last Updated : Apr 2, 2020, 12:33 AM IST
Flash: వైద్య సిబ్బంది, పోలీసులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ అహర్నిశలు సేవలు అందిస్తోన్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి, పోలీసు శాఖ సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు విశేష కృషి చేస్తోన్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి, పోలీసు శాఖ వారికి మార్చి నెలలో పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఈ రెండు శాఖలకు చెందిన ఉద్యోగులకు మార్చి నెలలో అదనపు నగదు ప్రోత్సాహం ( Incentives) కూడా చెల్లించాలని నిర్ణయించుకున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఎంత శాతం ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేది రానున్న ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read also : Coronavirus రోగులకు రోబోలతో ఆహారం, మెడిసిన్ సరఫరా
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దేశ ప్రధాని ఎటువంటి సందేశం ఇవ్వనున్నారనే ఉత్కంఠ స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగుతుంది అనే సందేహాలు, వదంతులను కేంద్రం కొట్టిపారేసినప్పటికీ.. గురువారం నాటి ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని ఏం చెప్పనున్నారా అనే ఆసక్తే ఎక్కువగా కనిపిస్తోంది. 

Read also : పోలీసులపై 'లోన్ వోల్ఫ్' దాడులకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కుట్ర

తెలంగాణలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. అన్ని రవాణా సదుపాయాలను నిలిపేయడంతో ఎక్కడి జనం అక్కడే ఆగిపోయారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం నిబంధనల ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తెలంగాణలో లాక్ డౌన్ విజయవంతమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తంచేయగా.. అంతకంటే ముందుగా ప్రధాని మోదీ పిలుపు మేరకు చేపట్టిన జనతా కర్ఫ్యూ సైతం తెలంగాణలో పకడ్బందీగా అమలైనట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

Trending News