"విరాట్ కోహ్లీ నిజంగానే జీనియస్. ఆయన ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్మెన్" అంటూ పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ భారత క్రికెట్ జట్టు రథసారథి విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.
బౌలర్ ఎవరనే దానితో సంబంధం లేకుండా క్రీజులో అడుగుపెట్టిన దగ్గరి నుంచి బాదడమే పనిగా పెట్టుకునే సెహ్వాగ్ కూడా ఓ బౌలర్ అంటే భయపడే వాడట. ఈ విషయాన్ని సెహ్వాగ్ స్వయంగా వెల్లడించాడు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీ ధరన్ బౌలింగ్ అంటే తనకు భయంగా ఉండేదని పేర్కొన్నాడు. అతని బౌలింగ్ ఎదుర్కోవడం కఠిన పరీక్ష లాంటిదని..షాట్ కొట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేదని పేర్కొన్నాడు. మురళీ బౌలింగ్ తో పాటు ముఖ కవళికలు కూడా తనను ఎంతగానో భయపెట్టేవన్నాడు. దీంతో కాస్త వత్తిడికి గురయ్యేవాడినని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
భారతదేశంలో చాలావరకు స్టేడియాలు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి. అరుదుగా గవాస్కర్, సచిన్, గంగూలీ ఆటగాళ్ల పేర్లమీద స్టేడియాలు ముంబై, కోల్కతా నగరాలలో కనిపిస్తాయి. మరి అమెరికాలో మన భారతీయ క్రీడాకారుడి పేరుమీద స్టేడియం ఉంటే ? తన పేరుమీద నిర్మితమైన ఆ స్టేడియాన్ని భారత క్రికెటర్ అక్టోబర్ నెలలో ఆరభించనున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రం కెంటకీలోని లూయిస్ విల్లేలో కొత్తగా నిర్మితమైన స్టేడియానికి భారత క్రికెటర్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట "సునీల్ గవాస్కర్ ఫీల్డ్" అని పేరు పెట్టారు. అమెరికా స్టేడియానికి భారత క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. "కేవలం ఆటగాళ్ల పేర్ల మీదే కాకుండా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.