భారత్‌లో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. గుజరాత్‌లోని అహ్మెదాబాద్‌లో కరోనావైరస్ బారినపడిన 85 ఏళ్ల వృద్ధురాలు బుధవారం రాత్రి మృతిచెందారు. ఈ వృద్ధురాలి మరణంతో భారత్‌లో కరోనావైరస్తో బాధపడుతూ మృతి చెందిన వారి సంఖ్య 12కి చేరింది.
తెలంగాణలో నేడు మరో 2 కరోనావైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వెలుగుచూసిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 41కి చేరింది. నేడు గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక మహిళతో పాటు మూడేళ్ల బాబు సైతం ఉన్నారు.
భారత్‌లో వ్యాపిస్తున్న కరోనావైరస్కి ప్రధాన కారణం విదేశీయులు.. లేదా విదేశాలకు వెళ్లొచ్చిన భారతీయులేనని పదేపదే నిరూపితమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అటువంటు ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
హంటావైరస్... ఇప్పటికే కరోనావైరస్ చేస్తోన్న విలయ తాండవం సరిపోదన్నట్టుగా కొత్తగా మళ్లీ ఇదేం వైరస్ అని అనుకుంటున్నారా ? అయితే దీని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిందే. కరోనావైరస్ పుట్టిన చైనాలోనే ఈ వైరస్ కూడా పుట్టింది.
కరోనావైరస్తో (Coronavirus) బాధపడుతూ మరో 38 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. దీంతో భారత్‌లో కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరుకుంది. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ICMR) వెల్లడించిన గణాంకాల ప్రకారం భారత్ లో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 341కి చేరుకుంది.
కరోనావైరస్ (Coronavirus) కాటుకు మరొకరు బలయ్యారు. కరోనాతో చనిపోయిన పేషెంట్‌కి తీవ్ర మధుమేహం, హై బీపీ, గుండె సంబంధిత జబ్బులతోనూ బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలోనే కరోనావైరస్ ఎటాక్ చేయడమే ఆ పేషెంట్ మృతికి కారణమైనట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.