Geetha Workers Insurance: కల్లుగీత కార్మికులకు అండగా నిలబడేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు బీమా పథకం తరహాలో గీత కార్మికుల బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా..
CM KCR Review Meeting: అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం.. తదితర అంశాలపై మంగళవారం ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Telangana Schools Closed: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా జనవరి 8 నుంచి 16 వరకు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడే లాక్ డౌన్, కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ కు వివరించారు.
Lockdown, COVID-19, black fungus, vaccination in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనాను కట్టడి చేసేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు కరోనా పరీక్షలను పెంచడం ద్వారా కరోనాను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, కొవిడ్-19 వాక్సిన్, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.