AP Speaker: ఏపీలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అదికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ విచారణ జరగనుంది. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.
Privilege committee enquiry: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సభా హక్కుల ఉల్లంఘన కేసు ఎదుర్కొంటున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ చర్యలు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ( Governor Biswabhushan harichandan ) కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని తదితరుల సమక్షంలో కేబినెట్ లో కొత్త మంత్రులు చేరారు.
ఏపీకి మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ సభలో నిరసనలకు దిగిన 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు సోమవారం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నేడు మంగళవారం జరిగే సమావేశాల్లో ఆ 17 మంది
టీడీపీ సభ్యులకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వీల్లేదు.
ఏపీకి 3 రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సోమవారం ఈ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల ఆవశ్యకతపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరణాత్మక ప్రసంగం ఇచ్చిన తర్వాత సభలో అధిక సంఖ్యలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఈ బిల్లుకు తమ ఆమోదం తెలిపారు. బిల్లుకు భారీ మెజార్టీతో మద్దతు లభించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.