AP: నిమ్మగడ్డది నియంతృత్వ పోకడ: స్పీకర్ తమ్మినేని సీతారాం

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మగడ్డ ప్రెస్‌మీట్..రాజకీయ సమావేశంలా ఉందనే అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిమ్మగడ్డ వైఖరిపై మండిపడ్డారు.

Last Updated : Jan 23, 2021, 05:49 PM IST
AP: నిమ్మగడ్డది నియంతృత్వ పోకడ: స్పీకర్ తమ్మినేని సీతారాం

Andhra pradesh : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మగడ్డ ప్రెస్‌మీట్..రాజకీయ సమావేశంలా ఉందనే అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిమ్మగడ్డ వైఖరిపై మండిపడ్డారు.

ఏపీ ( AP ) లో పంచాయితీ ఎన్నికల ( Panchayat Elections ) దుమారం రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమీషన్‌కు మధ్య వివాదాన్ని పెంచుతోంది. కరోనా వైరస్ సంక్రమణ, వ్యాక్సినేషన్ వంటి కీలకమైన అభ్యంతరాలు చెబుతున్నా ఎన్నికల నిర్వహణపై ఆసక్తి చూపిస్తుండటంతో నిమ్మగడ్డపై మండిపడుతున్నారు అధికార పార్టీ నేతలు. నిజంగానే ఎన్నికల నిర్వహణపై ఆసక్తి ఉంటే...2018లో జరగాల్సిన ఎన్నికల్ని అప్పట్లో ఎందుకు జరపలేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ( Ap Assembly speaker Tammineni sitaram ) ప్రశ్నించారు. రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ( Medical Emergency ) ఉన్న తరుణంలో ఎవరి ప్రాపకం, రాజకీయ లబ్ది కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారని నిమ్మగడ్డను ప్రశ్నించారు తమ్మినేని సీతారామ్. 

ప్రెస్‌మీట్‌లో మీ వరకూ అద్దాలు బిగించుకుని ఉన్నప్పుడు...ఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల్నించి వచ్చే  కార్మికులకు అదే రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. గతంలో వలస కార్మికుల ద్వారా కరోనా వైరస్ వ్యాపించిన సందర్భముందని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వైరస్  Corona virus ) బారిన పడి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని అడిగారు. ఫాల్స్ ప్రెస్టేజ్‌కు వెళ్తూ..నియంతృత్వ పోకడతో ఎందుకు వ్యవహరిస్తున్నారని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ( Nimmagadda Ramesh kumar ) పై నిప్పులు చెరిగారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా ఉండి..నిబంధనల్ని అతిక్రమించడం సబబేనా అని మండిపడ్డారు. ఛీప్ సెక్రటరీ అభిప్రాయాల్ని పరిగణలో తీసుకోకుండా సుప్రీంకోర్టు ( Supreme court ) ఆదేశాల్ని అతిక్రమించలేదా అని అడిగారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ఫోర్స్ మెజర్ కేసు కింద పరిగణించి ఎన్నికల్ని ఆపాల్సిన అవసరముందన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కుందని..దాన్ని కాలరాస్తూ ఎన్నికలు నిర్వహించడం ఏ మేరకు సరైందని ప్రశ్నించారు. కొద్ది మంది వ్యక్తుల ప్రయోజనాలకోసం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల ధన , ప్రాణాలకు నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రజలు కూడా ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరముందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.

Also read: AP: ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు అంత తొందరపాటెందుకు? అంబటి రాంబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News