KOO APP: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన దేశీయ సామాజిక మాధ్యమం కూ యాప్ క్రమక్రమంగా అందరికీ చేరువవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూ యాప్‌లో యాక్టివ్ అవుతున్నారు.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వైఖరిని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పెట్టుకున్న ఆశల్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదులుకోవల్సిందే. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని తెలుస్తోంది.
Ys Jagan Review: కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి మరోసారి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తూనే..కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు మౌళిక సదుపాయాలు మెరుగుపర్చుకునే దిశగా ఆదేశాలు జారీ చేశారు.
Nethanna hastam, Vidyakanuka and Agri gold victims: అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రూ. 20 వేలులోపు డిపాజిట్ చేసిన అగ్రి గోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ చేయనున్నట్లు చెప్పారు. 20 వేల రూపాయల లోపు డిపాజిట్లు చేసి మోసపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు ఇది కొంత ఊరటనిచ్చే అంశం కానుంది. Ration, pension cards, House patta, Aarogyasri scheme -రేషన్ బియ్యం, పెన్షన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలుపై ఫోకస్ చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
National Education Policy: ఏపీలో విద్యా సంస్కరణల్ని పెద్దఎత్తున అమలు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఛైర్మన్ ప్రశంసలు కురిపించారు.
YS Vivekananda Reddy's death case: పులివెందుల: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి స్పష్టంచేశారు. తాను చంపుతానని బెదిరించానంటూ వివేకానంద రెడ్డి వాచ్మెన్ రంగయ్య (Watchman Rangaiah) ఆరోపించిన నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డిపై (Erra Gangi Reddy) మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి.
Schools reopening in AP, Nadu nedu review meeting: అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో రూపొందించిన నాడు నేడు కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష (Nadu nedu review meeting) చేపట్టారు.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా కోస్తాంధ్రకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు సూచించారు.
Ysr Kapu Nestham: కరోనా సంక్షోభ సమయంలో సైతం ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా కాపునేస్తం పథకం వరుసగా రెండో ఏడాది అమలవుతోంది. వైఎస్సార్ కాపునేస్తం రెండవ విడత నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది.
AP Night Curfew: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సంక్రమణను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటోంది. కరోనా థర్డ్‌వేవ్‌కు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
Ys jagan review on polavaram: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం, పనుల్లో క్వాలిటీ విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్..కొన్ని సూచనలు చేశారు.
Ys Jagan Review: కోవిడ్ మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కోవిడ్ నివారణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కర్ప్యూ సడలింపుల్లో మరోసారి నిర్ణయం తీసుకున్నారు.
Polavaram project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.
Ysr Jayanthi: ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు..వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం కడప జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది.
Navaratnalu: కరోనా సంక్షోభ సమయంలో సామాన్యులు, పేదల పరిస్థితి దయనీయంగా మారింది. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరించి విదానాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నవరత్నాలు పథకం కరోనా కష్టకాలంలో ఆదుకుందంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
YS Jagan: శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య పేచీ పెద్దదవుతోంది. తెలంగాణ వైఖరిపై ఏపీ మండిపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ప్రధాని మోదీకు లేఖ రాశారు.
Anil Kumble: ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఏపీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
YS Jagan on Srisailam issue: ఏపీ, తెలంగాణ విద్యుత్ వివాదం కేంద్రానికి చేరింది. కేంద్ర మంత్రులకు ఏపీ ప్రభుత్వం లేఖల పరంపర కొనసాగుతోంది. మొన్న స్మృతి ఇరానీకు..నేడు జల విద్యుత్ శాఖమంత్రి గజేంద్ర షెకావత్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు.
TS Minister Jagadish Reddy comments on AP CM YS Jagan: సూర్యాపేట: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలుచేశారు. కృష్ణా నది, గోదావరి నది జలాల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగేలా సీఎం కేసీఆర్ ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఏపీ సీఎం జగన్ (CM KCR, AP CM YS Jagan) దానిని పక్కన పెట్టి అహంకారంతో పట్టింపులకు పోతున్నారని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.