Schools reopening in AP: ఆగస్టు 16 నుంచి స్కూల్స్ రీఓపెన్.. నాడు నేడుపై సీఎం సమీక్ష

Schools reopening in AP, Nadu nedu review meeting: అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో రూపొందించిన నాడు నేడు కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష (Nadu nedu review meeting) చేపట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 24, 2021, 11:09 AM IST
Schools reopening in AP: ఆగస్టు 16 నుంచి స్కూల్స్ రీఓపెన్.. నాడు నేడుపై సీఎం సమీక్ష

Schools reopening in AP, Nadu nedu review meeting: అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో రూపొందించిన నాడు నేడు కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan).. ఆగస్టు 16 నుంచే పాఠశాలల పునఃప్రారంభించాలని.. అప్పుడే తొలి విడత నాడు-నేడు పనుల ఫలాలను ప్రజలకు అంకితం చేయాలని అధికారులను ఆదేశించారు.

నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షా (Nadu nedu review) సమావేశం సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ''నాడు-నేడు కార్యక్రమం పనుల్లో ఎలాంటి అవినీతికి తావు ఉండకూడదు. అభివృద్ధి పనుల నాణ్యత, నిధుల వినియోగం విషయంలో చిన్న వివాదం కూడా రాకూడదని అధికారులకు సూచించారు. విద్యార్థుల కోసం నాడు-నేడు పేరుతో మంచి కార్యక్రమం చేపట్టాం. ఆ కార్యక్రమానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 

Also read : AP Inter Results 2021: ఏపీ ఇంటర్ సెకండీయర్ ఫలితాలు 2021 విడుదల

ఆగస్టు 16న పాఠశాలలు పునఃప్రారంభించిన (Schools reopening AP) సందర్భంలోనే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు సీఎం జగన్‌ తెలిపారు.

Also read : AP IAS Transfers: ఏపీలో అర్ధరాత్రి ఐఏఎస్ బదిలీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News