National Education Policy: జాతీయ విద్యా విధానంలో ఏపీ నెంబర్ వన్ స్థానం

National Education Policy: ఏపీలో విద్యా సంస్కరణల్ని పెద్దఎత్తున అమలు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఛైర్మన్ ప్రశంసలు కురిపించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 24, 2021, 05:42 PM IST
National Education Policy: జాతీయ విద్యా విధానంలో ఏపీ నెంబర్ వన్ స్థానం

National Education Policy: ఏపీలో విద్యా సంస్కరణల్ని పెద్దఎత్తున అమలు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఛైర్మన్ ప్రశంసలు కురిపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) ఆధ్వర్యంలో విద్యా సంస్కరణలకు పెద్దపీట వేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీను పగడ్బందీగా అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో జరుగుతున్న విద్యా సంస్కరణల్ని ఎన్ఈపీ ఛైర్మన్ కస్తూరి రంగన్ (Kasthuri Rangan) ప్రశంసించారు.11వ వర్శిటీ డిస్టింగ్విష్ లెక్చర్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఏపీలోని విద్యా సంస్కరణల్ని కీర్తించారు. వర్చువల్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రంగన్..ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. విద్యా సంస్కరణల అమలుకు ఆయన తీసుకున్న ప్రత్యేక చర్యల్ని కొనియాడారు.వర్చువల్ కార్యక్రమంలో ఏపీలోని విద్యా సంస్కరణల్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh)వివరించారు. 

ఎన్ఈపీ 2020 (NEP2020) అమలులో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రంగా ఉందని స్వయంగా కస్తూరి రంగన్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) ఆధ్వర్యంలో సమర్ధవంతంగా విద్యా సంస్కరణలు అమలవుతున్నాయని అభినందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం నిధులు, ఖర్చుల కోసం ఆలోచించకుండా పలు విద్యా పథకాల అమలును ప్రశంసించారు. 

Also read: Vizag Steel Plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం ఇకపై మరింత ఉధృతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News