మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు సెంచూరియన్‌లో ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. భారత్ అయిదుగురు బౌలర్లు, అయిదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. తొలి టెస్ట్ కోసం బరిలోకి దిగే తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం.
తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఐదవ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. అజింక్య రహానే, హనుమ విహారిలలో ఒకరికే అవకాశం దక్కనుంది. ఈ అంశంపై టెస్ట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై స్పందించాడు.
భారత జట్టులో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అజింక్య రహానేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టమే అని పేర్కొన్నాడు.
న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో వాంఖడే మైదానంలో రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా తొలి రోజు మొదటి సెషన్ కోల్పోవాల్సి వచ్చింది. మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ బాధ్యతలు చేపట్టాడు.
రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు రెండో టెస్టు ఆడడం లేదని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ ముగ్గురికి గాయాలవడమే అందుకు కారణం.
ముంబై టెస్టులో అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్‌లలో ఒకరిని మాత్రమే ఎంపిక చేయాల్సి వస్తే అది కష్టమైన నిర్ణయమని భారత మాజీ బ్యాటర్ వసీమ్ జాఫర్ అన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీనే స్వయంగా తేల్చుకోవాల్సిన విషయమని ఆయన పేర్కొన్నాడు.
IND vs NZ 1st Test Day 3: కాన్పూర్ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 296 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5, అశ్విన్ 3 వికెట్లతో మెరిశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమ్ఇండియా వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.
సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్ట్యూట్గా వచ్చిన కేఎస్ భరత్.. వచ్చీరాగానే సూపర్ క్యాచ్ అందుకున్నాడు. కెప్టెన్ అజింక్య రహానేను ఒప్పించి మరీ రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు.
రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచినా భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టులో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) దూరం అవ్వటంతో ఆ ప్లేస్ లో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టెస్టు క్రికెట్ అరంగేట్రం చేయనున్నాడు.. మరిన్ని విశేషాలు మీకోసం..!!
India's Squad For New Zealand Series: న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ (IND Vs NZ Test Series) కోసం జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News). రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండకపోగా.. రోహిత్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Team India Test Captain: న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు రెస్ట్ కారణంగా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవనున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది.
Ajinkya Rahane Dismissal Video : గత 18 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించే మెగా ఈవెంట్లలో తలపడిన ప్రతిసారి న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలవుతోంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యం భారత అవకాశాలను దెబ్బకొట్టిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
WTC Final 2021: ఇంగ్లాండ్‌లో ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను. బంతి శరీరానికి దగ్గరగా వచ్చినప్పుడు స్ట్రైట్ డ్రైవ్ ఆడాల్సి ఉంటుందని బీసీసీఐ.టీవీతో మాట్లాడుతూ Team India వైస్ కెప్టెన్ అజింక్య రహానే పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
Rohit Sharma Becomes 2nd Indian To get this Record: టెస్టు సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒకరు. కీలకమైన నాలుగో టెస్టులోనూ ఓంటరి పోరాటం చేస్తున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
Ajinkta Rahane Slams Century At MCG: రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే 195 బంతుల్లో శతకం సాధించాడు.
Tim Paine fastest wicket-keeper: ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ అరుదైన ఘనత సాధించాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ వికెట్ కీపర్ టీమ్ పైన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లలో పాలు పంచుకున్న వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు టీమ్ పైన్.
India vs Australia 2nd Test Live Updates Ajinkya Rahane: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలవు మీద భారత్‌కు తిరిగొచ్చేశాడు. దీంతో మిస్టర్ కూల్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కోహ్లీ గైర్హాజరిలో జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు
International Cricket Council టెస్టు ర్యాంకింగ్ ను విడుదల చేసింది. ఇందులో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్ టెన్ లో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. ఇందులో బూమ్రా తొమ్మిదవ స్థానానికి తగ్గాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.