IND vs NZ 1st Test Day 3: టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 49 పరుగుల ఆధిక్యం లభించింది. తన స్పిన్ మాయాజాలంతో స్పిన్నర్ అక్షర్ పటేల్ న్యూజిలాండ్ జట్టును అడ్డుకున్నాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు వచ్చిన టీమ్ఇండియా శుభ్ మన్ గిల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 129 వద్ద మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ లంచ్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు భారత బౌలర్లపై ఆధిపత్యం చలాయించి ధీటుగా పరుగులు చేసిన ఓపెనర్ విల్ యంగ్ (89)ను అశ్విన్ పెవీలియన్ చేర్చాడు. తర్వాత మరో ఓపెనర్ లాథమ్ (95)ను బోల్తా కొట్టించాడు అక్షర్ పటేల్. అనంతరం ఏ ఒక్క కివీస్ బ్యాట్స్‌మెన్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ (18), టేలర్ (11), జేమిసన్ (23), నికోలస్ (2), బ్లండెల్ (13), రచిన్ రవీంద్ర (13) వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు పరిమితమై 49 పరుగుల ఆధిక్యాన్ని టీమ్ఇండియాకు కివీస్ జట్టు అప్పగించింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లతో కివీస్ నడ్డివిరవగా.. అశ్విన్ 3, జడేజా, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.
వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట త్వరగానే ముగిసిపోయింది. ఈ సమయానికి టీమ్ఇండియా ఒక వికెట్ నష్టపోయి 14 పరుగులు చేసింది. గిల్ (1) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరగా.. పుజారా (9*), మయాంక్ (4*)క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి కివీస్‌పై 63 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమ్ఇండియా.
Also Read: KS Bharat: వచ్చీరాగానే సూపర్ క్యాచ్ అందుకున్న కేఎస్ భరత్.. రహానేని ఒప్పించి మరీ (వీడియో)!
Also Read: Krunal Pandya: సంచల నిర్ణయం తీసుకున్న కృనాల్ పాండ్యా.. గుడ్‌బై చెప్పేశాడు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook