Ajinkya Rahane కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వెల్లువ

India vs Australia 2nd Test Live Updates Ajinkya Rahane: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలవు మీద భారత్‌కు తిరిగొచ్చేశాడు. దీంతో మిస్టర్ కూల్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కోహ్లీ గైర్హాజరిలో జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు

Last Updated : Dec 27, 2020, 01:05 PM IST
  • ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య రెండో టెస్టు మ్యాచ్
  • మెల్‌బోర్న్ టెస్టులో 195కు ఆసీస్ జట్టు ఆలౌట్
  • భారత కెప్టెన్ రహానేపై మాజీ క్రికెటర్ల ప్రశంసల వెల్లువ
Ajinkya Rahane కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వెల్లువ

India vs Australia 2nd Test Live Updates: Ajinkya Rahane: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలవు మీద భారత్‌కు తిరిగొచ్చేశాడు. దీంతో మిస్టర్ కూల్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కోహ్లీ గైర్హాజరిలో జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రహానే. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతన్న రెండో టెస్టులో అతడి కెప్టెన్సీ నిజంగా అమోఘమంటూ అజింక్య రహానేపై మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లులు కురిపించారు.

భారత్ (Team India)‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును కేవలం 195 పరుగులకే ఆలౌట్ చేశారు. తొలి రోజు భారత్‌కు ఆధిక్యం, ఆధిపత్యం లభించింది. భారత్ సైతం తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 36 పరుగులు చేసింది. జస్ప్రిత్ బుమ్రా (4/56), అశ్విన్ (3/35), మహ్మద్ సిరాజ్ (2/40)తో రాణించారు. అయితే జట్టు బాధ్యతల్ని రహానే సమర్థవంతంగా నిర్వహించాడని.. మొదటి రోజు ఆట మాదేనని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఆధిపత్యాన్ని కొనసాగిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.

Also Read: Gold Price Today 27th December 2020: బంగారం జోరుకు బ్రేకులు.. లేటెస్ట్ రేట్లు ఇవే!

ఫీల్డింగ్ సమయంలో రహానే అద్భుతంగా ఆలోచించాడు. బౌలర్లకు సైతం సరైన సమయంలో బంతిని అందించాడని వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడాడు. బౌలర్లు బుమ్రా, అశ్విన్, సిరాజ్ అదరగొట్టేశారు, ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించడం బ్యాట్స్‌మెన్ చేతుల్లో ఉందన్నాడు.

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

అశ్విన్‌ను సాధ్యమైనంత త్వరగా బౌలింగ్‌ బాధ్యతలు అప్పగించడం, కొత్త బౌలర్ సిరాజ్‌కు సరైన సమయంలో బంతిని అందించడం రహానే (Ajinkya Rahane) తీసుకున్న గొప్ప నిర్ణయాలు అని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Also Read: India Vs Australia: తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆసీస్ ఆలౌట్

తొలిరోజు కచ్చితంగా టీమిండియాదే అని చెప్పాలి. అరంగేట్రం మ్యాచ్ అయినప్పటికీ కొత్త ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, శుభమాన్ గిల్ ఆత్మవిశ్వాసంతో ఆడేలా చేశాడు రహానే. తొలి టెస్టు అడిలైడ్ తప్పిదాలు మరోసారి రిపీట్ చేయకుండా అద్భుతంగా సారథ్యం వహించాడు రహానే అని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసించాడు.

Also Read: IPL: అప్పటినుంచే ఐపీఎల్‌లో 10 జట్లు.. బీసీసీఐ నిర్ణయం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News