ICC ODI Rankings | భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత ఆరు నెలలుగా మ్యాచ్‌లు ఆడకున్న విరాట్ కోహ్లీ నెంబర్ వన్, రెండో ర్యాంకులో రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ అసలైన సమరం నేడు జరగనుంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ వన్డేలో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (128; 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్), ఆరోన్ ఫించ్ (110; 114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్) శతకాలతో చెలరేగడంతో కేవలం 37.4 ఓవర్లలోనే ఆ జట్టు సునాయసంగా గెలుపొందింది.
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగవంతంగా (115వ ఇన్నింగ్స్‌ల్లో) 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు.
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ, వన్ డౌన్లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ మాత్రమే రాణించడంతో టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకి టీమిండియా జట్టు ఎంపిక విధానం సరైన పద్ధతిలో జరగలేదని తీవ్ర అసహనం వ్యక్తంచేశారు ప్రముఖ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. 'ఈ మ్యాచ్ నుంచి శిఖర్ ధావన్‌ని పక్కన పెట్టి అతడిని ఓ బలి పశువుని చేశారు' అని జట్టుని ఎంపిక చేసిన మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.