రాజ్‌కోట్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ ధావన్ (96; 90 బంతుల్లో 13ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ అనంతరం ఆసీస్ బౌలర్లపై చెలరేగిన ధావన్.. సెంచరీకి చేరువయ్యే క్రమంలో బౌండరీలే లక్ష్యంగా ఆడాడు. ఈ క్రమంలో రిచర్డ్ సన్ వేసిన ఇన్నింగ్స్ 29వ ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడబోయి.. మిచెల్ స్టార్క్ క్యాచ్ పట్టడంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
Shikhar Dhawan departs after a well made 96.
Live - https://t.co/v6DBzYGolk #INDvAUS pic.twitter.com/WUkA20BU2A
— BCCI (@BCCI) January 17, 2020
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (44 బంతుల్లో 42), ధావన్ శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 13.3 ఓవర్లలో 81పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. జంపా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి తొలి వికెట్ రూపంలో రోహిత్ నిష్క్రమించాడు.
Read also : ‘విరాట్ కోహ్లీ నిర్ణయం భారత్ కొంపముంచింది’
37 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 231పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 63), కేఎల్ రాహుల్ (12 బంతుల్లో 12) క్రీజులో ఉన్నారు. తొలి వన్డేలో ఓడిన భారత్ కచ్చితంగా రాజ్‌కోట్ వన్డేలో విజయం సాధించాలి. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. రిషబ్ పంత్ స్థానంలో మనీష్ పాండే, శార్ధూల్ ఠాకూర్ స్థానంలో నవదీప్ షైనీని జట్టులోకి తీసుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.