Mithali Raj: చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్.. వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళగా రికార్డు..

Mithali Raj: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా మిథాలీ రాజ్‌ రికార్డు సృష్టించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 04:56 PM IST
Mithali Raj: చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్.. వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళగా రికార్డు..

Mithali Raj breaks World Cup captaincy record: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో (ICC Women's World Cup 2022) భాగంగా.. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో భారత మహిళా జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (Mithali Raj) సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా నిలిచింది. తద్వారా ఆస్ట్రేలియా మాజీ సారథి బెలిండా క్లార్క్‌పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. కాగా ఐసీసీ మెగా టోర్నీలో 39 ఏళ్ల మిథాలీకి కెప్టెన్‌గా ఇది 24వ మ్యాచ్‌. ఇక ఐసీసీ మెగాటోర్నీల్లో బెలిండా ఆడిన 23 మ్యాచ్‌ల్లో 14 విజయాలు, 8 సార్లు ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఆమె కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా(1997, 2005) రెండుసార్లు వరల్డ్‌ కప్‌ ట్రోఫీని లిఫ్ట్‌ చేసింది.  

అదే విధంగా.. విండీస్‌తో (West Indies ) మ్యాచ్‌ ద్వారా మరో ఘనతను కూడా మిథాలీ తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచకప్‌ ఆరు ఎడిషన్లలో పాల్గొన్న ఏకైక మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఓవరల్ గా మూడో వ్యక్తి. ఇంతకముందు సచిన్, మియాందాద్ లు ఈ ఘనతను సాధించారు.  ఇక విండీస్‌తో మ్యాచ్‌లో బ్యాటర్‌గా మాత్రం మిథాలీ ఆకట్టుకోలేకపోయింది. 11 బంతులు ఎదుర్కొన్న ఆమె 5 పరుగులకే అవుట్‌ అయి అభిమానులకు మరోసారి నిరాశే మిగిల్చింది.

Also Read: India vs West Indies: ప్రపంచకప్ లో భారత్ జోరు.. వెస్టిండీస్‌ పై ఘన విజయం

ఇతర ఘనతలు: 

**అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో 7వేలకుపైగా పరుగులు చేసిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్.
**వన్డేల్లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసిన మెుదటి క్రీడాకారిణి మిథాలీ. అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన రికార్డును కూడా కలిగి ఉంది. 
**ఇండియా తరుపున టీ20ల్లో రెండు వేల పరుగులు చేసిన తొలి క్రీడాకారిణి మిథాలీ. అంతేకాకుండా మహిళల టీ20 క్రికెట్లో రెండు వేల పరుగులు చేసిన మెుదటి మహిళా క్రికెటర్ కూడా ఈమె కావడం విశేషం. 
**భారత్ తరపున 150 వన్డేలకు సారథ్యం వహించిన మెుదటి మహిళా క్రికటర్ గా మిథాలీ రికార్డు కలిగి ఉంది. 
**మిథాలీ...2003లో అర్జున అవార్డు, 2017లో విస్డెన్ లీడింగ్ ఉమెన్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్, 2015లో పద్మ శ్రీ అవార్డులను అందుకుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News