INDW Vs THAIW: ఆసియా కప్‌ సెమీస్‌ మ్యాచ్.. థాయ్‌లాండ్‌ ముందు భారీ లక్ష్యం! భారత్ ఫైనల్ చేరడం పక్కా

India Women set 149 target to Thailand Women at Women's Asia Cup Semi-Final 1. మహిళల ఆసియా కప్‌ 2022 తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 13, 2022, 10:46 AM IST
  • ఆసియా కప్‌ సెమీస్‌ మ్యాచ్
  • థాయ్‌లాండ్‌ ముందు భారీ లక్ష్యం
  • భారత్ ఫైనల్ చేరడం పక్కా
INDW Vs THAIW: ఆసియా కప్‌ సెమీస్‌ మ్యాచ్.. థాయ్‌లాండ్‌ ముందు భారీ లక్ష్యం! భారత్ ఫైనల్ చేరడం పక్కా

India Women set 149 target to Thailand Women at Women's Asia Cup Semi-Final 1: మహిళల ఆసియా కప్‌ 2022లో భాగంగా సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం  భారత్, థాయ్‌లాండ్‌ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన థాయ్‌లాండ్‌ కెప్టెన్ నరుఏమోల్ చైవై ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింట్‌కు భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. దాంతో థాయ్‌లాండ్‌ ముందు 149 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది హర్మన్‌ సేన. యువ ఓపెనర్‌ షెఫాలీ వర్మ (42; 28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్) చెలరేగగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (36; 30 బంతుల్లో 4 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. థాయ్‌లాండ్‌ బౌలర్ సొర్నరిన్‌ టిప్పొచ్‌ 3 వికెట్లు తీసింది. 

టాస్‌ ఓడి బ్యాటింట్‌కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్ షెఫాలీ వర్మ ధాటిగా ఆడగా.. స్మృతి మంధాన (13; 14 బంతుల్లో 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడింది. ఇదో ఓవర్ మూడో బంతికి మంధాన ఔట్ అయింది. దాంతో 38 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆపై జెమిమా రోడ్రిగ్స్ (27, 26 బంతుల్లో 3 ఫోర్లు) అండతో షెఫాలీ రెచ్చిపోయింది. 150 స్ట్రైక్‌ రేట్‌తో రన్స్ చేస్తూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.

షెఫాలీ వర్మ పెవిలియన్ చేరిన అనంతరం జెమిమా రోడ్రిగ్స్.. హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు పరుగులు చేయడంతో భ్బరాత్ స్కోర్ 100 దాటింది. రోడ్రిగ్స్, రిచా ఘోష్ (2) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఈ సమయంలో హర్మన్‌ప్రీత్ చెలరేగగా.. ఇన్నింగ్స్ చివరలో పూజా వస్త్రాకర్ (17) విలువైన రన్స్ చేసింది. థాయ్‌లాండ్‌ జట్టులో సొర్నరిన్‌ టిప్పొచ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఫన్నిటా మాయ, తిప్పట్చ పుత్తువాంగ్‌, నట్టాయ బూచతమ్‌ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత్ జోరు చూస్తే ఫైనల్ చేరడం పక్కా. 

Also Read: పాకిస్తాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవదహనం! వరదలు వదిలేసినా..

Also Read: Rayudu Fight: యువ ప్లేయర్‌తో అంబటి రాయుడు వాగ్వాదం.. ఇక మారవా అంటూ ఫాన్స్ ఫైర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News