Parthiv Patel Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పార్థివ్ ప‌టేల్

టీమిండియా మాజీ వికెట్ కీప‌ర్ పార్థివ్ ప‌టేల్ ( Parthiv Patel ) అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. అన్ని ఫార్మాట్ల (retires ) నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు బుధ‌వారం ట్విట్టర్ ద్వారా ప్ర‌క‌టించాడు.

Last Updated : Dec 9, 2020, 03:20 PM IST
Parthiv Patel Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పార్థివ్ ప‌టేల్

Parthiv Patel retires from all forms of cricket: ముంబై: టీమిండియా మాజీ వికెట్ కీప‌ర్ పార్థివ్ ప‌టేల్ ( Parthiv Patel ) అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. అన్ని ఫార్మాట్ల (retires ) నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు బుధ‌వారం ట్విట్టర్ ద్వారా ప్ర‌క‌టించాడు. 35 ఏళ్ల పార్థివ్ పటేల్.. టీమిండియా త‌ర‌ఫున 25 టెస్టులు, 38 వ‌న్డేలు, 2 టీ20లు ఆడాడు. అంతేకాకుండా దేశ‌వాళీ క్రికెట్‌లో గుజ‌రాత్ త‌ర‌ఫున 194 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. పిన్నవయసులోనే భారత జట్టు ( team India ) లో స్థానాన్ని సంపాదించుకున్న పార్థివ్.. అనతి కాలంలోనే టీంలో స్థానాన్ని కోల్పోయాడు. 

పార్థివ్ పటేల్ బుధవారం తన రిటైర్మెంట్ విష‌యాన్ని వెల్లడిస్తూ ఓ లేఖను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో త‌న‌కు స‌హ‌క‌రించిన బీసీసీఐ ( BCCI ), అంద‌రు కెప్టెన్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ( wicket keeper Parthiv Patel ) తన అనుభవాలను పంచుకున్నాడు. తొలిసారి 2002లో ఇండియ‌న్ టీమ్ త‌ర‌ఫున పార్థివ్ ఆడాడు. అప్పుడు టెస్టుల్లో అత్యంత పిన్న వ‌య‌సులో అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన వికెట్ కీప‌ర్‌గా రికార్డు సృష్టించాడు. ఇండియ‌న్ టీమ్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు పార్థివ్ వ‌య‌సు 17 ఏళ్ల 153 రోజులు మాత్రమే. Also read: Ind vs Aus 3rd T20I Highlights: మూడో టీ20లో పోరాడి ఓడిన కోహ్లీ సేన

అయితే అతిచిన్న వయసులో క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన పార్థివ్.. ఆ తర్వాత టీమిండియాలోకి దినేష్ కార్తీక్‌, ఎంఎస్ ధోనీ ( MS Dhoni ) రాక‌తో క్ర‌మంగా టీమ్‌లో స్థానాన్ని కోల్పోయాడు. 2004లో పార్థివ్ తొలిసారి టీమ్‌లో స్థానాన్ని కోల్పోయాడు. ఆ త‌ర్వాత మ‌రోసారి అవ‌కాశం వ‌చ్చినా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. ప్రస్తుతం పార్థివ్ పటేల్.. ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున ఆడుతున్నాడు. 

Also Read : India Vs Australia ODI Series: క్రికెట్‌లో ఆ షాట్‌ను నిషేధించాలి.. తెరపైకి కొత్త వాదన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News