యువ క్రికెటర్‌తో షారుఖ్ కూతురు ప్రేమాయణం?

యువ క్రికెటర్‌తో షారుఖ్ కూతురు ప్రేమాయణం?

Last Updated : Jun 2, 2018, 12:08 PM IST
యువ క్రికెటర్‌తో షారుఖ్ కూతురు ప్రేమాయణం?

సినీ తారలు, క్రికెటర్ల ప్రేమ వ్యవహారాలు సర్వసాధారనమైనా.. వారికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ధోనీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇలా చాలా మంది క్రికెటర్స్ బాలీవుడ్ భామలతో ప్రేమలో పడినట్లు గతంలో కథనాలు, వార్తలు వచ్చాయి. అయితే వీరిలో కొహ్లీ మాత్రమే ఆ వార్తను నిజం చేశాడు. గత ఏడాది డిసెంబర్‌లో కొహ్లీ-అనుష్క ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటీవలే యువ క్రికెటర్ కేఎల్ రాహుల్, యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో జంట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

బాలీవుడ్‌ కింగ్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌(17) యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ల అనంతరం నైట్‌రైడర్స్‌ యువ ఆటగాడు గిల్‌తో సుహానా మాట్లాడుకోవడం అందరి దృష్టిని  ఆకర్షించింది. ప్రస్తుతం వీరు బయట డిన్నర్లు, పార్టీలకంటూ తిరుగుతున్నారని సోషల్‌ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. సుహానా ఇటీవలే మే 22న తన 18వ పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది. సుహానా ఖాన్ త్వర‌లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. సుహానా ప్రస్తుతం ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతోంది.

అండర్-19 జట్టు ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్11వ సీజన్‌లో 1.8 కోట్లకు కొనుగోలు చేసింది. రైతు కొడుకైన 18 ఏళ్ల శుభ్‌మన్‌ గిల్‌ రెండేళ్ల నుంచి అండర్ వరల్డ్ కప్ కోసం శిక్షణ పొందుతున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ 2018 టోర్నమెంట్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు న్యూజిలాండ్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌లలో శుభ్‌మన్‌ గిల్‌ మొత్తం 372 పరుగులు చేసి భారత్‌కు అండర్ 19 ప్రపంచ కప్ తెచ్చిపెట్టడంలో కృషి చేశాడు.

 

Trending News