Sreesanth: 9 ఏళ్ల తర్వాత తొలి ఫస్ట్‌క్లాస్‌ వికెట్ తీసిన శ్రీశాంత్.. ఆనందంలో ఏం చేశాడంటే?

S Sreesanth: టీమ్‌ఇండియా సీనియర్ పేస్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ తొమ్మిదేళ్ల తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తొలి వికెట్‌ సాధించాడు. ఈ మ్యాచ్ లో శ్రీశాంత్ రెండు వికెట్లు సాధించటం విశేషం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 06:17 PM IST
  • తొమ్మిదేళ్ల తర్వాత శ్రీశాంత్‌కు తొలి ఫస్ట్‌క్లాస్‌ వికెట్
  • సంతోషంలో పిచ్ కు షాష్టాంగ నమస్కారం చేసిన బౌలర్
Sreesanth: 9 ఏళ్ల తర్వాత తొలి ఫస్ట్‌క్లాస్‌ వికెట్ తీసిన శ్రీశాంత్.. ఆనందంలో ఏం చేశాడంటే?

Sreesanth Celebrates His 1st Wicket in First-Class Cricket After Nine Years: టీమిండియా వెటరన్ బౌలర్ శ్రీశాంత్ (S Sreesanth) తొమ్మిదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో తొలి వికెట్‌ తీశాడు. 39 ఏళ్ల ఈ కేరళ ఆటగాడు మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 11.5 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లను సాధించాడు. మెుదటగా మేఘాలయ బ్యాటర్‌ ఆర్యన్‌ బోరా వికెట్‌ పడగొట్టిన ఆనందంలో పిచ్‌ మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. ‘‘దేవుడి దయ కారణంగా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నాకు ఫస్ట్ వికెట్ దక్కింది. ''చాలా సంతోషంగా ఉంది. అందుకే పిచ్‌ మీద సాష్టాంగ ప్రణామం చేశా’''’అంటూ శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. 

శ్రీశాంత్.. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ( IPL spot-fixing in 2013) జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  నిషేధం ముందు వరకు టీమిండియా తరుపున శ్రీశాంత్.. 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వివిధ విభాగాల్లో అప్పీలు చేసుకోగా అతని శిక్షను తగ్గించారు.  2020 సెప్టెంబర్‌ నాటికి శ్రీశాంత్‌ నిషేధం పూర్తి కావడంతో... అప్పటి నుంచి జాతీయ జట్టులో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఫిబ్రవరి నెలలో జరిగిన ఐపీఎల్‌  మెగా వేలంలోనూ రూ. 50 లక్షల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో నిరాశతో వెనుదిరిగాల్సి వచ్చింది. అయితే కేరళ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడే అవకాశం మాత్రం వచ్చింది. 

మేఘాలయ జరిగి మ్యాచ్‌లో మెుదట బ్యాటింగ్‌ చేసిన కేరళ 505/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 148/10, రెండో ఇన్నింగ్స్‌లో191/10 ఆలౌట్ అయింది. దీంతో కేరళ 166 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లోనూ శ్రీశాంత్ 19 రన్స్ చేశాడు. అయితే ఆర్యన్‌ బోరా బౌలింగ్‌లోనే శ్రీశాంత్ ఔట్‌ అవ్వడం విశేషం.

Also Read: Deepak Chahar: ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నైకు ఎదురుదెబ్బ.. సగం మ్యాచ్​లకు దీపక్ చాహర్ దూరం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News