PAK vs NZ Match: ఆ రెండూ దృశ్యాలు అద్భుతాలే, పాక్ కివీస్ మ్యాచ్‌లో వైరల్ అవుతున్న దృశ్యాలు

T20 World Cupలో రెండు ఫోటోలు లేదా వీడియాలు నిన్నట్నించి వైరల్ అవుతున్నాయి. ఒకటి అత్యద్భుత క్యాచ్ అయితే మరొకటి అంతకు మించిన అవుటాఫ్ క్రీజ్ అవుట్. ఒకటే మ్యాచ్‌లో చోటుచేసుకున్న రెండు దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2021, 08:04 AM IST
  • పాకిస్తాన్ న్యూజిలాండ్ టీ 20 ప్రపంచకప్ మ్యాచ్‌లో రెండు అద్భుతాలు
  • క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా వైరల్ అవుతున్న డెవాన్ కాన్వాయ్ డైవ్ క్యాచ్
  • త్రో ఆఫ్ ది టోర్నమెంట్‌గా వైరల్ అవుతున్న హసన్ అలీ త్రో
 PAK vs NZ Match: ఆ రెండూ దృశ్యాలు అద్భుతాలే, పాక్ కివీస్ మ్యాచ్‌లో వైరల్ అవుతున్న దృశ్యాలు

T20 World Cupలో రెండు ఫోటోలు లేదా వీడియాలు నిన్నట్నించి వైరల్ అవుతున్నాయి. ఒకటి అత్యద్భుత క్యాచ్ అయితే మరొకటి అంతకు మించిన అవుటాఫ్ క్రీజ్ అవుట్. ఒకటే మ్యాచ్‌లో చోటుచేసుకున్న రెండు దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

టీ20 ప్రపంచకప్‌లో నిన్న జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్(Newzealand vs Pakistan)మ్యాచ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కారణం పాకిస్తాన్ వరుస విజయం కానేకాదు. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో రెండు అద్భుతాలు జరిగాయి. ఒకటి న్యూజిలాండ్(Newzealand)ఫీల్డర్ అద్భుత క్యాచ్‌తో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపితే..రెండవది పాకిస్తాన్ బౌలర్ అద్భుత అవుటాప్ క్రీజ్ రనవుట్‌తో ఇంటికి పంపించాడు. ఆ వివరాలు పరిశీలిద్దాం.

Catch of the Match Devon Conway: టి20 ప్రపంచకప్‌లో(T20 World Cup) భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు డెవన్‌ కాన్వే సూపర్‌ క్యాచ్‌తో మెరిశాడు. మిచెల్‌ సాంట్నర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ ఆఖరి బంతిని మహ్మద్‌ హఫీజ్‌ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అయితే అక్కడున్న కాన్వే పరిగెత్తుకుంటూ ఎడమవైపుకు పూర్తిగా గాలిలో డైవ్ చేసి..గాలిలోనే క్యాచ్ తీసుకున్నాడు. కాన్వే అందుకున్న క్యాచ్‌.. టోర్నమెంట్‌లో సూపర్‌ క్యాచ్‌గా(Catch of the Tournament)నిలిచే అవకాశముందని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇక మరో సంఘటన ఇదే మ్యాచ్‌లో పాకిస్తాన్(Pakistan)వైపు నుంచి. Hasan Ali Stunning Throw. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఫాస్ట్‌‌బౌలర్‌ హసన్‌ అలీ(Hasan Ali) స్టన్నింగ్‌ త్రోతో అద్భుతం సృష్టించాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను తన బౌలింగ్‌లోనే అద్భుత రనౌట్‌తో పెవిలియన్‌ చేర్చాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ను హసన్‌ అలీ వేశాడు. ఓవర్‌ తొలి బంతిని విలియమ్సన్‌ ఢిపెన్స్‌ ఆడాడు. అయితే విలియమ్సన్‌ రిస్క్‌ అని తెలిసినప్పటికి సింగిల్‌కు ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న కాన్వే వెనక్కి వెళ్లిపోవడంతో విలియమ్సన్‌ మళ్లీ వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే హసన్‌ అలీ వేగంగా పరిగెత్తి బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. Never be out of crease, stay in, Out side there is tight security అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. 

Also read: T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ దిశగా పాకిస్తాన్, 4 పాయింట్లతో అగ్రస్థానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News