Umran Malik Fastest Ball: ఉమ్రాన్‌ మాలిక్‌ సరికొత్త రికార్డు.. తొలి భారత బౌలర్‌గా..! టాప్ 5 లిస్ట్ ఇదే

Umran Malik clocks 156 kph in 1st ODI against SL, betters record as India's fastest bowler. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా ఉమ్రాన్‌ మాలిక్‌ రికార్డుల్లోకి ఎక్కాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 10, 2023, 09:16 PM IST
  • ఉమ్రాన్‌ మాలిక్‌ సరికొత్త రికార్డు
  • తొలి భారత బౌలర్‌గా..!
  • టాప్ 5 లిస్ట్ ఇదే
Umran Malik Fastest Ball: ఉమ్రాన్‌ మాలిక్‌ సరికొత్త రికార్డు.. తొలి భారత బౌలర్‌గా..! టాప్ 5 లిస్ట్ ఇదే

Umran Malik Fastest Delivery, Umran Malik rewrites Fastest Ball records once again: టీమిండియా యువ పేసర్‌, కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో గంటకు 156 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ఈ ఫీట్ సాధించాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 14వ ఓవర్‌ నాలుగో బంతికి ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఉమ్రాన్‌ తన రికార్డును తానే అధిగమించాడు. 

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 155 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి టీ20ల్లో భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇక 1999 ప్రపంచకప్‌లో మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ గంటకు 154.5 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. శ్రీలంక పర్యటన వరకు భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన రికార్డు జవగల్ పేరుపైనే ఉంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గంటకు 153.7 వేగంతో బంతిని వేశాడు. మొహ్మద్ షమీ గంటకు 153.3 వేగంతో బంతిని సంధించగా.. జస్ప్రీత్ బుమ్రా గంటకు 152.2 కిలోమీటర్ల వేగంతో బంతని విసిరాడు.  

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో సైతం భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా ఉమ్రాన్‌ మాలిక్‌ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్‌ 157 కిమీ వేగంతో బంతిని సంధించాడు. లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్‌లో 157.3 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు బద్దలు కాలేదు. 

భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన బంతి:
# ఉమ్రాన్‌ మాలిక్‌ - 156
# జవగల్ శ్రీనాథ్ - 154.5 
# ఇర్ఫాన్ పఠాన్ - 153.7 
# మొహ్మద్ షమీ - 153.3 
# జస్ప్రీత్ బుమ్రా - 152.2

Also Read: H3N2 Virus: కరోనా వైరస్‌ అని టెస్ట్ చేస్తే.. బయటపడుతున్న కొత్త వ్యాధి! తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే   

Also Read: Mahindra Cheapest SUV: మహీంద్రా చౌకైన కారు.. 6 మంది కూర్చోవచ్చు! ధర 6 లక్షలు మాత్రమే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News