తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అంటే ఎంత అభిమానమో చెప్పారు. ‘ఇందుకే రాహుల్ ద్రవిడ్ నా అభిమాన క్రికెటర్ మాత్రమే కాకుండా నా అభిమాన వ్యక్తి కూడా’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ కింద ఆయన ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ద్రవిడ్ పై వచ్చిన ఓ ఆర్టికల్ క్లిప్పింగ్ ను కూడా జతచేసి పోస్టు చేశారు. ఆ ఆర్టికల్ లో ద్రవిడ్ గొప్ప వ్యక్తిత్వాన్ని చాటే అంశాలున్నాయి.
అండర్-19 భారత జట్టుకు ద్రవిడ్ చీఫ్ కోచ్ గా చక్కని మార్గదర్శకం చూపించి ప్రపంచ కప్ గెలుపుకు కారణమైన విషయం తెలిసిందే. అయితే, కోచింగ్ టీమ్ లో తనకు రూ.50 లక్షలు, మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించడంతో రాహుల్ ద్రవిడ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలాంటి వివక్ష తగదని అందరికీ సమాన పారితోషికం ఇవ్వాలని సూచించాడు. రాహుల్ ద్రవిడ్ మాటకు తలొగ్గి బీసీసీఐ ద్రవిడ్ సహా ప్రతి సభ్యుడికి రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. సమానత్వం కోసం ద్రవిడ్ తీసుకున్న ఈ చొరవ హర్షణీయం. దీనినే కేటీఆర్ పరోక్షంగా గుర్తుచేశారు.
This is why Rahul Dravid is not only my favourite cricketer but also my favourite person as well 🙏 https://t.co/xsSas8wdSV
— KTR (@KTRTRS) February 26, 2018
అందుకే రాహుల్ ద్రవిడ్ నా అభిమాన వ్యక్తి