India vs Zimbabwe: మూడో విజయంతో భారత సంచలన రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా భారత్‌

Team India Creats New History First Team With 150 Wins T20Is: టీ 20 ప్రపంచకప్‌ సాధన తర్వాత భారత క్రికెట్‌ జట్టు మరో సత్తా చాటింది. జింబాబ్వేపై జరిగిన మూడు మ్యాచ్‌ను నెగ్గేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 10, 2024, 11:44 PM IST
India vs Zimbabwe: మూడో విజయంతో భారత సంచలన రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా భారత్‌

Team India New History: ప్రపంచకప్‌ సాధించిన అనంతరం భారత జట్టు మరో అద్భుత రికార్డు నెలకొల్పింది. జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో ఆధిక్యంలో నిలిచింది. యువ ఆటగాళ్లు సమష్టి కృషితో మూడో మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుని సిరీస్‌లో ఆధిక్యం సాధించారు. అయితే ఈ విజయంతో భారత జట్టు అరుదైన రికార్డును నమోదు చేసింది. ఈ విజయంతో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 150 విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్‌ రికార్డు నెలకొల్పింది.

Also Read: Gautam Gambhir: భారత జట్టు హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌.. అతడి క్రికెట్‌ విశేషాలు తెలుసా?

 

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు మరో విజయాన్ని ఖరారు చేసుకుంది. జింబాబ్వేతో బుధవారం మూడో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ అర్ధ సెంచరీ (49 బంతుల్లో 66 పరుగులు) చేయగా.. ఒక్క పరుగు తేడాతో రుతురాజ్‌ గైక్వాడ్‌ (28 బంతుల్లో 49 స్కోర్‌) ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. యశస్వి జైస్వాల్‌ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో శతకం బాదిన అభిషేక్‌ శర్మ ఈ మ్యాచ్‌లో పది పరుగులే చేశాడు. ఇక బౌలింగ్‌లో జింబాబ్వే బౌలర్లు తేలిపోయారు. వికెట్లు తీయకున్నా స్కోర్లకు కళ్లెం వేసినా భారీగా పరుగులు వచ్చాయి. సికందర్‌ రజా, ముజరబానీ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Also Read: Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్‌.. రేవంత్‌ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?

 

తీవ్ర ఒత్తిడిలో ఉన్న జింబాబ్వే ఆటగాళ్లు ఆ ఒత్తిడిలోనే మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. నిర్ణీత ఓవర్లను 6 వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేసి జింబాబ్వే ఓటమి అంచున నిలిచింది. డియాన్‌ మైర్స్‌ (65*), మదండే (37) పోరాడినా జట్టుకు నిరాశ తప్పలేదు. ఆరంభమే జట్టుకు కలిసిరాలేదు. 39 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సమయంఓల వారిద్దరూ రంగంలోకి దిగి జట్టుకు విజయం కోసం కృషి చేశారు. ఆరో వికెట్‌కు వీరివురూ 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది. మ్యాచ్‌ చేజారుతుందనే భయాన్ని జింబాబ్వే కల్పించింది. బౌలింగ్‌ విషయానికి వస్తే భారత బౌలర్లు సత్తా చాటారు. ఆరంభం దూకుడుగా వేసి ఆఖరులో కొంత తడబడ్డారు. అనంతరం తేరుకుని కట్టుదిట్టమైన బౌలింగ్‌ వేయడంతో జింబాబ్వేను ఓడించారు. వాషింగ్టన్‌ సుందర్‌ మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. ఆవేశ్‌ ఖాన్‌ రెండు వికెట్లు, ఖలీల్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ తీశాడు.

ఈ విజయంతో భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటివరకు జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 150 విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్‌ రికార్డు నెలకొల్పింది. ఆడిన 230 మ్యాచ్‌ల్లో 150 విజయాలు భారత్‌ సొంతం నమోదు చేసింది. తర్వాతి స్థానం పాకిస్థాన్‌ దక్కించుకుంది. 245 మ్యాచ్‌ల్లో 142 విజయాలతో రెండో స్థానంలో పాక్‌ నిలవగా.. న్యూజిలాండ్‌ మూడో స్థానంలో ఉంది.

టీ20లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు ఇవే..
భారత్‌- 150 (230 మ్యాచ్‌ల్లో 150 విజయాలు)
పాకిస్థాన్‌ 142 (245 మ్యాచ్‌ల్లో 142 విజయాలు)
న్యూజిలాండ్‌ 111 (220 మ్యాచ్‌ల్లో 111 విజయాలు)
ఆస్ట్రేలియా 105 (195 మ్యాచ్‌ల్లో 105 విజయాలు)
దక్షిణాఫ్రికా 104 (185 మ్యాచ్‌ల్లో 104 విజయాలు)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News