MS Dhoni: మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డుకు ఎసరు పెట్టిన Virat Kohli, అడుగు దూరంలో

Virat Kohli Equals MS Dhonis Test Record  | అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంతో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా ఈ ఫీట్ సాధించాడు. టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సంయుక్తంగా ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 4, 2021, 05:25 PM IST
  • టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు
  • అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంతో ఇంగ్లాండ్ జట్టుతో చివరిదైన నాలుగో టెస్టు
  • అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన భారత కెప్టెన్‌గా ధోనీ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ
MS Dhoni: మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డుకు ఎసరు పెట్టిన Virat Kohli, అడుగు దూరంలో

Virat Kohli Equals MS Dhonis Test Record  | టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంతో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా ఈ ఫీట్ సాధించాడు. టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సంయుక్తంగా ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు.

గత నెలలో ఇదే వేదికగా కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన టెస్టు ద్వారా ఎంఎస్ ధోనీ అత్యధిక టెస్టు కెప్టెన్సీ రికార్డుకు అడుగు దూరంలో ఉన్న విరాట్ కోహ్లీ, నేడు ఆ రికార్డును సమం చేశాడు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలు చెరో 60 టెస్టు మ్యాచ్‌లలో  భారత జట్టుకు సారథ్యం వహించారు. కాగా, ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా Team India కెప్టెన్ కోహ్లీ ఇంకా ఆటలో కొనసాగుతున్నాడు. వచ్చే నెలలో ఈ రికార్డును అధిగమించనున్నాడు కోహ్లీ.

Also Read: Ind vs Eng 4th Test Live Score Updates: నాలుగో టెస్టులోనూ రాణిస్తున్న టీమిండియా బౌలర్లు, Ben Stokes ఒంటరి పోరాటం

గతంలో సచిన్ టెండూల్కర్ పరుగుల రికార్డులను ఒక్కొక్కటిగా బద్దలుకొడుతూ ముందుకుసాగిన విరాట్ కోహ్లీ(Virat Kohli) గత కొంతకాలం నుంచి ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ రికార్డులకు ఎసరు పెట్టాడు. వీరి తర్వాత గంగూలీ 49 టెస్టులు, మహ్మద్ అజారుద్దీన్ 47 టెస్టులు, సునీల్ గవాస్కర్ 47, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 40, కపిల్ దేవ్ 34, రాహుల్ ద్రావిడ్ 25, సచిన్ టెండూల్కర్ 25, బిషన్ సింగ్ బేడీ 22 టెస్టులకు సారథ్యం వహించి టాప్ 20లో ఉన్నారు.

Also Read: HBL PSL 6 postponed: కరోనా కారణంగా వాయిదా పడిన PSL 2021

కాగా, పర్యాటక జట్టు ఇంగ్లాండ్‌పై మూడో టెస్టులో నెగ్గడం ద్వారా స్వదేశంలో అత్యధిక విజయవంతమైన సారధిగా కోహ్లీ నిలిచాడు. స్వదేశంలో ఎక్కువ టెస్టులలో భారత జట్టుకు విజయం అందించిన కెప్టెన్‌గా, ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ అందించిన తొలి కెప్టెన్‌గానూ కోహ్లీ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గత కొంతకాలం నుంచి బ్యాట్స్‌మెన్‌గా విఫలం అవుతున్నా కెప్టెన్‌గా కోహ్లీ విజయాలు కొనసాగుతూనే ఉండటం జట్టు ప్రదర్శనకు నిదర్శనం.

Also Read: Kieron Pollard 6 Sixes Video: యువరాజ్ సింగ్ తరహాలో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన కీరన్ పోలార్డ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News