IND vs BAN Highlights: కోహ్లీ మెరుపు సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం

IND vs BAN Highlights: వన్డే ప్రపంచకప్‌ లో భారత్‌కు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. బంగ్లా పులులు రోహిత్‌  సేనకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కోహ్లీ సెంచరీ చేశాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2023, 10:34 PM IST
IND vs BAN Highlights: కోహ్లీ మెరుపు సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం

Cricet World Cup 2023, IND vs BAN Highlights: వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా బంగ్లాదేశ్ పై గెలిచి నాలుగో విజయాన్ని నమోదు చేసింది భారత్. విరాట్ కోహ్లీ మెరుపు సెంచరీతో బంగ్లా పులులను మట్టికరిపించింది టీమిండియా. 

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో తాంజిద్‌ హసన్ (51; 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), లిట్టన్ దాస్‌ (66; 82 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. ముష్ఫీకర్ రహీమ్‌ (38; 46 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. చివర్లో మహ్మదుల్లా మెరుపులు మెరిపించడంతో భారత్ ముందు ఓ మాదిరి లక్ష్యాన్ని ఉంచగలిగింది బంగ్లా. మహ్మదుల్లా  36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు.

రోహిత్ మెరుపులు..కోహ్లీ సెంచరీ..
అనంతరం ఛేదనను ప్రారంభించిన టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ గిల్. వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. రోహిత్‌ శర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు. త్రుటిలో అర్ధసెంచరీ మిస్ చేసుకున్నాడు హిట్ మ్యాన్. శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. శుభ్‌మన్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీకి జతకలిసిన శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ స్కోరును పెంచారు. అయితే శ్రేయస్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 19 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత కోహ్లీ, కేఎల్ రాహుల్ టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు.  ఈ క్రమంలో కోహ్లీ శతకాన్ని నమోదు చేశాడు. విరాట్ 42వ ఓవర్‌ మూడో బంతికి సిక్సర్‌బాది సెంచరీ చేయడమే గాక  భారత విజయాన్ని ఖాయం చేశాడు.   

Also Read: SA vs Netherlands: మీరెక్కడ తగులుకున్నారా..! అప్పుడు.. ఇప్పుడు సఫారీకి అదే జట్టు షాక్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook 

Trending News