Deepak Chahar Marriage: సీఎస్కే బౌలర్ దీపక్ చహర్ పెళ్లి మరి కాస్సేపట్లో, వీడియో వైరల్

Deepak Chahar Marriage: టీమ్ ఇండియా బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్ వివాహం మరి కాస్సేపట్లో జరగనుంది.  ఈ సందర్బంగా సంగీత్‌లో దీపక్ డ్యాన్స్‌తో అదరగొట్టేశాడు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 1, 2022, 11:14 PM IST
Deepak Chahar Marriage: సీఎస్కే బౌలర్ దీపక్ చహర్ పెళ్లి మరి కాస్సేపట్లో, వీడియో వైరల్

Deepak Chahar Marriage: టీమ్ ఇండియా బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్ వివాహం మరి కాస్సేపట్లో జరగనుంది.  ఈ సందర్బంగా సంగీత్‌లో దీపక్ డ్యాన్స్‌తో అదరగొట్టేశాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చహర్ పెళ్లి..తన చిన్ననాటి స్నేహితురాలు జయా భరద్వాజ్‌తో మరి కాస్సేపట్లో అంటే జూన్ 1వ తేదీ రాత్రి జరగనుంది. ఆగ్రాలోని జేపీ ప్యాలస్ లో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరగబోతోంది. ఈ సందర్భంగా మే 31వ తేదీన ఏర్పాటైన సంగీత్ ఫంక్షన్‌లో దీపక్ చహర్ డ్యాన్స్‌తో అలరించాడు. తీన్‌మార్ స్టెప్పులతో దీపక్ చహర్ అందర్నీ అలరించాడు. 

ఐపీఎల్ 2022లో దీపక్ చహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా దీపక్ చహర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఐపీఎల్ 2021లో సీఎస్కే టైటిల్ సాధనలో దీపక్ చహర్ కీలకపాత్ర పోషించాడు. రిసెప్షన్ ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సీఎస్కే స్టార్ ప్లేయర్లు, విరాట్ కోహ్లీ దంపతులు, మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ ఎంఎస్ ధోని ఇలా మొత్తం 60 మంది పాల్గొనబోతున్నారు.

Also read: అతడికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం.. అదృష్టవశాత్తు ఇద్దరం ఒకే జట్టులో ఉన్నాం: రషీద్‌ ఖాన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News