India Vs Pakistan Match: ఐసీసీ ప్రణాళిక ప్రకారం భారత్- పాక్ మ్యాచ్ జరగాల్సిందే: రాజీవ్ శుక్లా

కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్ల కారణంగా భారత్- పాక్ మ్యాచ్ రద్దు చేయాలన్న మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ & బిహార్‌ డిప్యూటీ సీఎం తార్‌కిషోర్‌ డిమాండ్ లపై స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. మ్యాచ్ జరగాల్సిందేనని చెప్పారు. ఇంకేం అన్నారంటే..??

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2021, 03:09 PM IST
  • కాశ్మీర్ అల్లర్ల కారణంగా భారత్- పాక్ మ్యాచ్ రద్దు చేయాలన్న మంత్రి గిరిరాజ్‌
  • ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా
  • దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. కానీ ఐసీసీ ప్రణాళిక ప్రకారం ఆడాల్సిందే
India Vs Pakistan Match: ఐసీసీ ప్రణాళిక ప్రకారం భారత్- పాక్ మ్యాచ్ జరగాల్సిందే: రాజీవ్ శుక్లా

India-Pakistan Match in T20 World Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India Vs Pakistan) మ్యాచ్ కోసం రెండు దాయాది దేశ ప్రజలే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. కానీ కశ్మీర్‌లో (Kashmir) జరుగుతున్న దాడుల కారణంగా టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup)లో భారత్- పాక్ (Indo-Pak) మధ్య అక్టోబరు 24న జరగనున్న మ్యాచ్ పై మరోసారి ఆలోచించాలని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ (Central Minister Giriraj Singh ) మరియు బిహార్‌ (Bihar) డిప్యూటీ సీఎం తార్‌కిషోర్‌ ప్రసాద్‌ (Deputy CM Tarkishore Prasad) డిమాండ్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.. 

ఫలితంగా గత కొద్దీ రోజులుగా  #banpakcricket అనే యాష్ టాగ్ ట్విట్టర్ లో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉండగా... యావత్ క్రికెట్ ప్రపంచం దాయాదుల పోరు గురించి ఎదురుచూస్తున్నాయి. 

Also Read: Viral Video: అనుమానం పెనుభూతం.. భర్తపై అనుమానంతో జిమ్‌లో మహిళను ఇరక్కొట్టిన భార్య

అయితే కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ (Giriraj Singh) మరియు బిహార్‌ డిప్యూటీ సీఎం తార్‌కిషోర్‌ ప్రసాద్‌ టీ20 ప్రపంచ కప్ లో భారత్-పాక్ మధ్య జరగబోయే మ్యాచ్ రద్దు చేయాలన్న డిమాండ్ పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు (BCCI Vice President) రాజీవ్ శుక్లా (Rajeev Shukla) స్పందించారు. ఇంటర్నేషనల్ టోర్నీలలో మ్యాచ్ లు ఆడతామని మాట ఇచ్చాక.. ఇతర కారణాలను చూపించి వెనక్కి తీసుకోలేమని తెలిపారు. ఐసీసీ (ICC) నిసర్దేశించిన ప్రణాళిక ప్రకారం టోర్నీలో పాల్గొనాల్సిందే అని తెలిపారు. 

Also Read: Viral Video:రన్నింగ్ రైలు నుండి దిగబోతూ కిందపడబోయిన గర్భిణీ.. కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

బీసీసీఐ (Board of Control for Cricket in India) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ... "కశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్ర దాడులను, ఉద్రవాదులు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము.. ఇలా అల్లకల్లోలం శృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పక తీసుకోవాలి. కానీ దేశం తరపున ఒకసారి మ్యాచ్ ఆడతామని... ఐసీసీకి ఇచ్చిన ]తరువాత.. తిరస్కరించే వీలు లేదని తేల్చి చెప్పారు. ఐసీసీ (International Cricket Council) ప్రణాళిక పరంగా సూచించిన దేశాలతో మ్యాచ్ ఆడాల్సిందే" అని వాపోయారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News