IND vs PAK: వారిద్దరూ రాణించకపోతే.. టీమిండియాపై ఒత్తిడి తప్పదు: హఫీజ్‌

Mohammad Hafeez on IND vs PAK Match: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ రాణించకపోతే భారత జట్టుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని  మహమ్మద్‌ హఫీజ్‌ అన్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 04:12 PM IST
  • టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల
  • పాక్‌తో భారత్‌ మ్యాచ్‌
  • టీమిండియాపై ఒత్తిడి తప్పదు
IND vs PAK: వారిద్దరూ రాణించకపోతే.. టీమిండియాపై ఒత్తిడి తప్పదు: హఫీజ్‌

Mohammad Hafeez on IND vs PAK Match: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రాణించకపోతే భారత జట్టుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని పాక్ మాజీ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ అన్నాడు. మిగతా భారత ఆటగాళ్లను కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ తాజాగా టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 16 నుంచి మెగా టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా.. అక్టోబరు 22 నుంచి సూపర్-12 స్టేజ్ మ్యాచులు ఆరంభం కానున్నాయి.

మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ అక్టోబరు 23న ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్‌ (IND vs PAK)తో ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌కు చాలా సమయం ఉన్నా.. మెగా టోర్నీపై అప్పుడే చర్చ మొదలైంది. మాజీలు భారత్-పాకిస్తాన్ మ్యాచుపై తమతమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్‌ హఫీజ్‌ (Mohammad Hafeez) స్పందించాడు. 'ప్ర‌స్తుతం పాకిస్తాన్ జ‌ట్టు టీ20 ఫార్మాట్‌లో రోజురోజుకి ఎదుగుతోంది. మా ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు. ఈసారి కూడా భార‌త్‌పై క‌చ్చితంగా గెలుస్తాం' అని హఫీజ్‌ ధీమా వ్యక్తం చేశాడు. 

Also Read: Go first republic Day offer: గో ఫస్ట్​ రిపబ్లిక్​ డే ఆఫర్​- రూ.926కే విమాన టికెట్​!

'పాకిస్థాన్‌తో జరిగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారీగా పరుగులు చేయకపోతే.. భారత జట్టు ఒత్తిడిలో పడిపోతుంది. టీమిండియాలో మంచి ఆటగాళ్లు ఉన్నా.. ఎక్కువగా వీరిద్దరిపైనే భారత్‌ ఆధారపడుతోంది. పాకిస్తాన్ లాంటి జట్టుతో ఆడేటప్పుడు ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వీరిద్దరూ ఆడకపోతే ఇతర భారత ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పవు. అయితే మిగతా వారిని తక్కువగా అంచనా వేయడం లేదు' అని మహమ్మద్‌ హఫీజ్‌ పేర్కొన్నాడు.  

Also Read: Samantha Item Song: మరో పాన్ఇండియా మూవీలో ఐటెం సాంగ్ కు 'ఊ' కొట్టిన సమంత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News