సౌరభ్ గంగూలీ బయోపిక్‌ వచ్చే అవకాశముందా.!

క్రికెటర్ సౌరభ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కనుందని.. బాలాజీ టెలిఫిలిమ్స్ అనుబంధ సంస్థ ఆల్ట్ బాలాజీ ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

Last Updated : May 21, 2018, 09:37 PM IST
సౌరభ్ గంగూలీ బయోపిక్‌ వచ్చే అవకాశముందా.!

క్రికెటర్ సౌరభ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కనుందని.. బాలాజీ టెలిఫిలిమ్స్ అనుబంధ సంస్థ ఆల్ట్ బాలాజీ ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నిమిత్తం గంగూలీతో మాట్లాడడానికి ఇటీవలే ఆల్ట్ బాలాజీ ప్రతినిధులు కోల్‌కతా వచ్చారని కూడా వినికిడి. గంగూలీ జీవితకథ ఆధారంగా వచ్చిన "ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్" అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించే అవకాశం ఉందంటున్నారు.

ఇప్పటికే సచిన్ టెండుల్కర్ జీవితంపై వచ్చిన డాక్యుమెంటరీ "సచిన్ - ది బిలియన్ డ్రీమ్స్"తో పాటు ఎంఎస్ ధోనిపై వచ్చిన బయోపిక్ కూడా సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా గంగూలీ బయోపిక్ కూడా తెరకెక్కిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. అయితే గంగూలీ నుండి ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. 

తన బయోపిక్ తెరకెక్కే అవకాశముంటే.. తప్పక బెంగాలీ దర్శకుడికి ఛాన్స్ ఇస్తానని గతంలో గంగూలీ అన్నారని సమాచారం. అయితే ఏక్తా కపూర్ ఈ బయోపిక్‌ను తమ సంస్థ తెరకెక్కిస్తే ముంబయి దర్శకుడినే పెట్టుకొనే అవకాశముందని పలువురు అంటున్నారు.

Trending News