CWG 2022: స్మృతి మంధాన టూ దీపికా పల్లికల్.. కామన్వెల్త్ గేమ్స్ 2022లో పోటీపడే అందమైన భామలు వీరే!

Most Beautiful female athletes in Commonwealth Games 2022. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశానికి చెందిన క్రికెటర్ స్మృతి మంధాన, స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ లాంటి అందమైన ప్లేయర్స్ ఆడబోతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 27, 2022, 03:11 PM IST
  • జూలై 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ 2022
  • స్మృతి మంధాన టూ దీపికా పల్లికల్
  • అందమైన భామలు వీరే
CWG 2022: స్మృతి మంధాన టూ దీపికా పల్లికల్.. కామన్వెల్త్ గేమ్స్ 2022లో పోటీపడే అందమైన భామలు వీరే!

Most Beautiful female athletes in Commonwealth Games 2022: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2022కి సమయం ఆసన్నమైంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు మెగా గేమ్స్ జరగనున్నాయి. ఇప్పటికే 322 మంది సభ్యులతో కూడిన జంబో జట్టు ఇంగ్లండ్ చేరుకుంది. ఇతర దేశాల అథ్లెట్‌లు కూడా బర్మింగ్‌హామ్‌లో అడుగుపెట్టాయి. మహిళల టీ20 క్రికెట్, బీచ్ వాలీబాల్, బాస్కెట్‌బాల్‌ మరియు పారా టేబుల్ టెన్నిస్ ఈసారి భాగం అయ్యాయి. దాంతో కామన్వెల్త్ గేమ్స్ 2022కి మరింత కల వచ్చింది. 

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశానికి చెందిన క్రికెటర్ స్మృతి మంధాన, స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ లాంటి అందమైన ప్లేయర్స్ ఆడబోతున్నారు. భారత్ నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ఎంతో మంది అందమైన భామలు కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆడనున్నారు. టట్జానా స్కోన్‌మేకర్, ఎల్లీస్ పెర్రీ, తాలిక్వా క్లాన్సీ లాంటి ముద్దుగుమ్మలు కనువిందు చేయనున్నారు. 

దీపికా పల్లికల్:
బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో స్క్వాష్ ప్లేయర్స్ దీపికా పల్లికల్, జోష్నా చినప్ప మరియు సౌరవ్ ఘోసల్ ఆడనున్నారు. భారత క్రికెటర్ దినేష్ కార్తీక్‌ను వివాహం చేసుకున్న దీపిక.. సీడబ్ల్యూజీలో ఇప్పటికే రెండు రజతాలు మరియు ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

స్మృతి మంధాన:
భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన తన ఆటతోనే కాదు అందంతోనూ అభిమానులను అలరించనున్నారు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మరియు బార్బడోస్‌లతో కూడిన గ్రూప్ Aలో భారత్ ఆడనుంది. 

ఎల్లీస్ పెర్రీ:
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్‌ ఎల్లీస్ పెర్రీ కూడా కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆడుతున్నారు. మహిళల క్రికెట్ ఈసారి అరంగేట్రం చేయడంతో.. పెర్రీ మొదటిసారి కామన్వెల్త్ గేమ్స్ ఆడుతున్నారు. 

తాలిక్వా క్లాన్సీ:
ఆస్ట్రేలియా బీచ్ వాలీబాల్ మహిళల జట్టుకు తాలిక్వా క్లాన్సీ నాయకత్వం వహిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మొదటి స్వదేశీ ఆస్ట్రేలియన్ వాలీబాల్ ప్లేయర్ తాలిక్వా. 

టట్జానా స్కోన్‌మేకర్:
అందమైన భామలలో దక్షిణాఫ్రికా స్విమ్మర్ టట్జానా స్కోన్‌మేకర్ ఒకరు. ఆమె బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో తలపడనున్నారు. 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. 2020 ఒలింపిక్ క్రీడలలో 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్నారు. 

Also Read: IND vs WI 3rd ODI: మూడో వన్డేకు వరణుడి ముప్పు.. మ్యాచ్ కష్టమే!

Also Read: Samyuktha Menon: అలాంటిది ఏమీ లేదు.. త్రివిక్రమ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సంయుక్త మీనన్‌!  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News