ఐస్ క్రికెట్ ఆడనున్న ఆఫ్రిది.. సెహ్వాగ్

మామూలు క్రికెట్ గురించి వినుంటారు.. కానీ ఐస్ క్రికెట్ గురించి విన్నారా.. బాగా శీతల ప్రదేశంలో మంచు గడ్డలతో నిండిన మైదానంలో స్వెటర్లు ధరించి క్రికెటర్లు బ్యాటింగ్, బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుంది.. చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా.

Last Updated : Dec 25, 2017, 08:39 PM IST
ఐస్ క్రికెట్ ఆడనున్న ఆఫ్రిది.. సెహ్వాగ్

మామూలు క్రికెట్ గురించి వినుంటారు.. కానీ ఐస్ క్రికెట్ గురించి విన్నారా.. బాగా శీతల ప్రదేశంలో మంచు గడ్డలతో నిండిన మైదానంలో స్వెటర్లు ధరించి క్రికెటర్లు బ్యాటింగ్, బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుంది.. చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. గత కొంతకాలంగా ఐస్ క్రికెట్ మ్యాచ్‌లు స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మార్టిజ్ ప్రాంతంలో జరుగుతున్నాయి. 2018లో కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ మ్యాచ్‌లు నిర్వహించే బాధ్యత తీసుకున్నారు దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్ మరియు పాక్ క్రికెటర్ సయిద్ ఆఫ్రిది.

ఈ సారి ఈ ఐస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడడానికి మొగ్గుచూపిన క్రికెటర్లలో భారత ఆటగాళ్లైన వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్ కూడా ఉన్నారు. సాధారణంగా రిటైరైన క్రికెటర్లే ఈ ఐస్ క్రికెట్ ఆడడానికి మొగ్గుచూపడం విశేషం. ఈ సారి జరిగే మ్యాచ్‌ల్లో షోయబ్ అక్తర్, మహెల జయవర్థన, లసిత్ మలింగ, మైఖేల్ హస్సీ, డేనియల్ వెటోరి, మోంటీ పనేసర్ తదితరులు కూడా ఆడనున్నారు. 

Trending News