SL Vs AUS: అరుదైన ఘటన.. స్వదేశంలో అస్ట్రేలియాకు సపోర్ట్ చేసిన శ్రీలంక ఫాన్స్!

Sri Lanka Cricket Team fans cheer for Australia. పరిమిత ఓవర్ల సిరీసులు ఆడేందుకు శ్రీలంకకు వచ్చిన ఆస్ట్రేలియాకు లంక ఫాన్స్ మద్దతు ఇస్తూ కృతజ్ఞతలు తెలిపారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 25, 2022, 06:04 PM IST
  • అరుదైన ఘటన
  • స్వదేశంలో అస్ట్రేలియాకు సపోర్ట్ చేసిన శ్రీలంక ఫాన్స్
  • 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
SL Vs AUS: అరుదైన ఘటన.. స్వదేశంలో అస్ట్రేలియాకు సపోర్ట్ చేసిన శ్రీలంక ఫాన్స్!

Sri Lanka Cricket Team fans cheer for Australia: క్రికెట్ ఆటలో స్వదేశంలో ఆడే జట్టుకు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్థిపై తమ జట్టు గెలవాలని ఫాన్స్ సపోర్ట్ చేస్తారు. అదే సమయంలో పర్యాటక జట్టుకు పెద్దగా మద్దతు లభించదు. అయితే విజిటింగ్ టీమ్‌కి స్వదేశీ ప్రేక్షకులు మద్దతు పలికిన అరుదైన ఘటన తాజాగా చోటుచేకుంది. పరిమిత ఓవర్ల సిరీసులు ఆడేందుకు శ్రీలంకకు వచ్చిన ఆస్ట్రేలియాకు లంక ఫాన్స్ మద్దతు ఇస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు కారణం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకకు ఆసీస్ రావడమే.

శ్రీలంక గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఆహారం, ఇంధనం, ఔషధాలతో సహా నిత్యావసరాల దిగుమతికి ఆటంకం కలుగుతోంది. లంక వాసులు ప్రతి దానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇలాంటి కష్ట సమయంలో శ్రీలంకలో ఆస్ట్రేలియా క్రికెట్ ఆడడానికి రావడం లంకలోని క్రికెట్ అభిమానులకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు పెద్ద మనసుతో శ్రీలంక పర్యటనకు రావడం కాస్త ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో లంక అభిమానులు కష్టాల్లో ఉన్న తమ దేశానికి వచ్చిన ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు తెలిపారు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య శుక్రవారం జరిగిన ఐదవ వన్డే సందర్భంగా.. మైదానంలోని ప్రేక్షకులు 'శ్రీలంక పర్యటనకు వచ్చినందుకు థాంక్యూ ఆస్ట్రేలియా' అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మొత్తానికి లంక అభిమానులు తమ చర్యతో అందరి హృదయాలను దోచుకున్నారు. 

శ్రీలంకతో శుక్రవారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మొదటి, చివరి వన్డేలను ఆసీస్ గెలవగా.. 2,3,4 వన్డేలను లంక గెలిచింది. దాంతో శ్రీలంక వన్డే సిరీసును 3-2 తేడాతో గెలుచుకుంది. అంతకుముందు జరిగిన టీ20 సిరీసును ఆసీస్ కైవసం చేసుకుంది. 

Also Read: మెదడు చురుగ్గా పని చేయాలంటే.. ఈ జ్యూస్ తాగండి! ఇంకా ఆలస్యం ఎందుకు.. 

Also Read: Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో కీర్తి సురేష్.. కోహినూర్ వజ్రంలా మెరిసిపోతున్న కళావతి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News