Tokyo Paralympics 2020: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. జావిలన్‌త్రో లో దేవేంద్ర ఝజారియా రజతం పతకం సాధించగా, సుందర్ సింగ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో సోమవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి.
అంతకు ముందు పారా ఒలింపిక్స్(Paralympics 2020)లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో విజయం సాధించి అవని లేఖారా(avani lekhara) గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి అవని లేఖర 249.6 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని(Gold Medal) కైవసం చేసుకుంది. ఫలితంగా డిసెంబరు 2018లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఇరీనా షెట్నిక్ నమోదు చేసిన ప్రపంచ రికార్డును అవని సమం చేసింది.
పారాలింపిక్స్(Paralympics)లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా అవని(avani lekhara) రికార్డులకెక్కింది. మొత్తంగా పసిడి సాధించిన ఐదో మహిళగా చరిత్ర సృష్టించింది. జైపుర(Jaipur)కి చెందిన పందొమ్మిదేళ్ల రైఫిల్ షూటర్ అవని.. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న పిన్న వయస్కురాల్లో ఒకరు. అభినవ్ బింద్రా(Abhinav Bindra )రాసిన ‘ఎ షాట్ ఎట్ హిస్టరీ’ పుస్తకం ఈమెపై చాలా ప్రభావం చూపింది. డిస్కస్ త్రోలో ఎఫ్-56 విభాగంలో యోగేశ్ కధూనియా(Yogesh Kadhunia) రజత(Silver Medal) పతకం సాధించాడు. డిస్కస్‌త్రోలో వినోద్(Vinod) మెరిశాడు కానీ మూడో స్థానంలో నిలిచిన అతడికి కాంస్య పతకంపై నేడు స్పష్టత రానుంది.
Also Read: Model BBL Surgery: బాబోయ్..! రూ. 26లక్షలతో సర్జరీ.. కూర్చోలేకున్న..కోట్లలో సంపాదన...!
ఇప్పటి వరకు పతకాలు సాధించింది వీరే..
1. అవని లేఖారా- గోల్డ్ మెడల్ (షూటింగ్)
2. యోగేశ్ కధూనియా- సిల్వర్ మెడల్(డిస్కస్ త్రో)
3. నిశాద్ కుమార్- సిల్వర్ మెడల్(హైజంప్)
4.భవీనాబెన్ పటేల్- సిల్వర్ మెడల్(టేబుల్ టెన్నిస్)
5. దేవేంద్ర ఝజారియా- సిల్వర్ మెడల్(జావిలన్‌త్రో)
6. సుందర్ సింగ్- కాంస్య పతకం(జావిలన్‌త్రో)
7. వినోద్ కూమార్- కాంస్య పతకం(డిస్కస్ త్రో)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook