Shoaib Akhtar On Babar Azam: టీ20 వరల్డ్ కప్‌లో రెండు వరుస ఓటముల తరువాత పాకిస్థాన్ జట్టు అన్ని వైపులా నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. భారత్ ఓడిపోయినా పెద్ద జట్టు అనుకుని సర్దుకున్నా.. జింబాబ్వే చేతిలో కూడా ఓటమి పాలవ్వడంతో ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై నెట్టింట భారీగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అవ్వగా.. జింబాబ్వే టీమ్‌పై 4 పరుగులే చేయడంతో అతని బ్యాటింగ్ తీరుపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
రావాల్పిండి ఎక్స్‌ప్రెస్, పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా బాబర్ అజామ్‌పై మండిపడ్డాడు. బాబర్ బ్యాడ్ కెప్టెన్ అని.. ఆటను ఎందుకు అర్థం చేసుకోలేపోతున్నారో అర్థం కావడం లేదన్నాడు. పాకిస్థాన్ జట్టు ఓడిపోవడం చాలా బాధగా ఉందన్నాడు.
'నేను ఇప్పుడు ఏమి చెప్పను..? పాకిస్థాన్‌కు బ్యాడ్ కెప్టెన్ ఉన్నాడని నేను అంటాను. రెండో మ్యాచ్‌లోనే పాకిస్థాన్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. నేను బాబర్‌ను మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు రావాలని పదే పదే చెబుతున్నా అతను పట్టించుకోవడం లేదు. అంతేకాదు షాహీన్ షా అఫ్రిది ఫిట్‌నెస్‌లో చాలా లోపాలు ఉన్నాయి.. ఇవి సరిదిద్దుకోవాలి' అంటూ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడాడు.
మేనేజ్‌మెంట్, పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజాపై కూడా అక్తర్ మండిపడ్డాడు. ప్రపంచానికి ఇప్పుడు పీసీబీ సమాధానం చెప్పాలన్నాడు. పాక్ ఆటతీరుపై ఏం చెప్తారని ప్రశ్నించాడు. పాకిస్థాన్ ఈ వారంలో తిరిగి వస్తుందని, వచ్చే వారం భారత్ టోర్నీ నుంచి వైదొలుగుతుందని జోస్యం చెప్పాడు. టీమిండియా సెమీ ఫైనల్ తరువాత ఇంటికి వెళ్లిపోతుందన్నాడు.
ఇండియా, జింబాబ్వే చేతిలో ఓటమి తరువాత పాక్ సెమీస్ భవితవ్యం ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ ఇకపై ఆడే అన్ని మ్యాచ్‌లు మంచి నెట్ రన్‌రేట్‌తో గెలవాలి. ఇండియా అన్ని మ్యాచ్‌లు గెలవడంతో పాటు.. సౌతాఫ్రికా, జింబాబ్వే రెండు మ్యాచ్‌లు ఓడిపోవాలి. ఇలా జరిగితే పాక్ సెమీస్ చేరే అవకాశం ఉంటుంది.
Also Read: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ దక్షిణాఫ్రికా.. ప్రొటీస్‌కు కలిసిరాని ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లు ఇవే!
Also Read: Nirmala Sitharaman: వైసీపీ ఎమ్మెల్యేకు క్లాస్ పీకిన కేంద్ర మంత్రి.. ఏం చేస్తున్నారంటూ నిలదీత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook