Maria Sharapova: తల్లైన రష్యా అందం మారియా షరపోవా.. గొప్పదైన బహుమతి అంటూ ట్వీట్!

Russian Tennis Star Maria Sharapova Welcomes Son. ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ మరియు మాజీ ప్రపంచ నంబర్ వన్ మరియా షరపోవా 2022 జులై 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 16, 2022, 12:28 PM IST
  • తల్లైన రష్యా అందం మారియా షరపోవా
  • గొప్పదైన బహుమతి అంటూ ట్వీట్
  • కుమారుడి పేరు 'థియోడర్‌'
Maria Sharapova: తల్లైన రష్యా అందం మారియా షరపోవా.. గొప్పదైన బహుమతి అంటూ ట్వీట్!

Russian Tennis Star Maria Sharapova Welcomes Son: మాజీ టెన్నిస్‌ స్టార్‌, రష్యా అందం మారియా షరపోవా ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ మరియు మాజీ ప్రపంచ నంబర్ వన్ మరియా షరపోవా 2022 జులై 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా శుక్రవారం అభిమానులతో పంచుకున్నారు. దాంతో షరపోవాకు నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫాన్స్. 

బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యాపారవేత్త అలెగ్జాండర్‌ గిల్కెస్‌తో 35 ఏళ్ల రష్యా అందం మారియా షరపోవా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు 2020లో తమకు నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. తాను గర్భవతినని ఏప్రిల్‌లో వెల్లడించిన షరపోవా.. జూలై 1న తొలి సంతానానికి జన్మనిచ్చారు. తన కుమారుడి పేరు 'థియోడర్‌' అని షరపోవా ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్రవారం వెల్లడించారు. 

మారియా షరపోవా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ ఫొటో పోస్ట్ చేస్తూ... 'థియోడర్‌ రూపంలో మా కుటుంబానికి అత్యంత అందమైన, ఎంతో గొప్పదైన బహుమతి దక్కింది' అని పేర్కొన్నారు. థియోడర్‌ జన్మించిన విషయాన్ని షరపోవా అధికారికంగా వెల్లడించారు. రష్యా అందం  ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలో  చిన్నారి చాలా ముద్దుగా ఉన్నాడు. ఈ ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Maria Sharapova (@mariasharapova)

టెన్నిస్ కెరీర్‌లో మారియా షరపోవా ఐదు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలుచుకున్నారు. 17 ఏళ్ల వయసులో 2004లో షరపోవా తొలి వింబుల్డన్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. ఆ తర్వాత  2006లో యూఎస్‌ ఓపెన్‌, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్‌, 2012లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ కిరీటాలను కైవసం చేసుకున్నారు. షరపోవా తన సుదీర్ఘ కెరీర్‌కు 2020లో వీడ్కోలు పలికి.. వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. షరపోవా టెన్నిస్ ఆడిన రోజల్లో ఆమెకు అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అందం, ఆటతో ఎందరో యువకులను మాయ చేశారు. 

Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో రోజుకు రూ.50 చెల్లిస్తే చాలు.. రూ.35 లక్షలు మీ సొంతమవుతాయి.. 

Also Read: Weight loss In 5 Days: ఎన్ని చిట్కాలు పాటించిన బరువు తగ్గలేకపోతున్నారా.. అయితే ఇలా సుభంగా 5 రోజుల్లో క్యాబేజీతో బరువు తగ్గండి..!  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News