వరల్డ్ కప్‌: టీమిండియా ఎంట్రీ అదుర్స్.. ఘన విజయం కట్టబెట్టిన రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఐసిసి ప్రపంచ కప్‌ పోటీల్లో భారత్ శుభారంభం లభించింది. సౌతాఫ్రికాతో బుధవారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేయగా 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికే ఆ లక్ష్యాన్ని అందుకోగలిగింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసి పెవిలియన్‌కు పంపించడంలో భారత బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ ఎలాగైతే సక్సెస్ అయ్యారో... అలాగే బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ రాణించాడు. 

Last Updated : Jun 6, 2019, 03:17 PM IST
వరల్డ్ కప్‌: టీమిండియా ఎంట్రీ అదుర్స్.. ఘన విజయం కట్టబెట్టిన రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

సౌతాంప్టన్: ఐసిసి ప్రపంచ కప్‌ పోటీల్లో భారత్ శుభారంభం లభించింది. సౌతాఫ్రికాతో బుధవారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేయగా 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికే ఆ లక్ష్యాన్ని అందుకోగలిగింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసి పెవిలియన్‌కు పంపించడంలో భారత బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ ఎలాగైతే సక్సెస్ అయ్యారో... అలాగే బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ రాణించాడు. 

నేటి మ్యాచ్‌లో సఫారీలపై సెంచరీ చేయడం ద్వారా రోహిత్ శర్మ వన్డేల్లో 23వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 144 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది మొత్తం 122 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. టీమిండియా విజయంలో ఎంతో కీలకపాత్ర పోషించాడు. మిగతా ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోని 34 పరుగులతో రాణించాడు. శిఖర్ ధావన్ 8, కెప్టెన్ విరాట్ కోహ్లీ 18, లోకేశ్ రాహుల్ 26, పాండ్యా 15 పరుగులు చేశారు.

Trending News