Rohit Sharma On Hardik Pandya: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సంప్రదాయాన్ని కొనసాగించింది. గత పదేళ్లుగా తొలి మ్యాచ్‌లో ఓడిపోతున్న ముంబై.. ఈ సీజన్‌లో అదే తరహాలో మొదటి మ్యాచ్ దేవుడికి ఇచ్చేసింది. చివరకు పోరాడినా.. గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తరువాత హార్థిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఫీల్డ్‌లో రోహిత్ శర్మను బౌండరీ లైన్ దగ్గర నిలబెట్టడం.. కొత్త ప్లేయర్‌ను మార్చినట్లు అటు ఇటు మార్చడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కెప్టెన్‌గా పాండ్యా తీసుకున్న నిర్ణయాలపై మండిపడుతున్నారు. ప్రపంచస్థాయి బౌలర్ బుమ్రాను కాదని.. పాండ్యా ఫస్ట్ స్పెల్ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రేక్షకుల నుంచి కూడా పాండ్యాకు అస్సలు సపోర్ట్ లభించలేదు.
Also Read: BRS Loksabha List: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ 17 మంది అభ్యర్ధుల జాబితా
పాండ్యా టాస్‌కు వచ్చిన సమయంలో ఫ్యాన్స్ అంతా రోహిత్.. రోహిత్ అంటూ కేకలు పెట్టారు. మ్యాచ్ మధ్యలో గ్రౌండ్‌లోకి కుక్క రాగా.. ఒక్కసారి హార్దిక్ పాండ్యా.. పాండ్యా అంటూ గట్టిగా అరిచారు. చివరి ఓవర్‌లో మ్యాచ్ గెలిపించకుండా పాండ్యా ఔట్ అవ్వడం మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ఆకాశ్ అంబానీ, రషీద ఖాన్‌తో రోహిత్ శర్మ మాట్లాడుతుండగా.. పాండ్యా వెనుక నుంచి వచ్చి హిట్‌మ్యాన్‌కు హగ్ ఇచ్చాడు. అయితే రోహిత్ ఊహించని విధంగా రియాక్ట్ అయ్యాడు.
హార్ధిక్ పాండ్యాపై చిరాకు పడ్డాడు. వెనక్కి తిరిగి సీరియస్‌గా ఏదో చెప్పాడు. పాండ్యా ముఖంలో హవభావాలు మారిపోయాయి. హిట్ మ్యాన్ మాట్లాడుతున్నంతసేపు సైలెంట్ విన్నాడు. అక్కడే ఉన్న రషీద్ ఖాన్, ఆకాశ్ అంబానీ ఈ సంభాషణ విని దూరంగా వెళ్లిపోయారు. పాండ్యాకు రోహిత్ క్లాస్ పీకుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ముంబై ఓటమిపై మాత్రం రోహిత్ శర్మ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ బాగా ఆడాలని కానీ ముంబై మాత్రం ఓడిపోవాలని తమ కోరిక అని.. ఐపీఎల్ మొత్తం ఇదే జరగాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో గుజరాత్ 168 పరుగులకే పరిమితం చేసింది. అయితే అనంతరం ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఐదు ఓవర్లలో 43 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో ఏడు వికెట్లు ఉన్నా ముంబై లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
Also Read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter