Rishabh Pant: ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుకొట్టిన రిషబ్ పంత్

Written by - Shankar Dukanam | Last Updated : Jan 19, 2021, 12:37 PM IST
  • భారత యువ క్రికెట్ సంచలనం రిషబ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు
  • ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రికార్డు బద్దలు
  • నాలుగో టెస్టులో భాగంగా టెస్ట్ కెరీర్‌లో 1000 పరుగుల మార్కు చేరుకున్నాడు పంత్
Rishabh Pant: ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుకొట్టిన రిషబ్ పంత్

Rishabh Pant Fatest Indian Wicketkeeper To Reach 1000 Test Runs భారత యువ క్రికెట్ సంచలనం రిషబ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుకొట్టాడు. బ్రిస్బేన్ వేదికగా గబ్బా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో భాగంగా టెస్ట్ కెరీర్‌లో 1000 పరుగుల మార్కు చేరుకున్నాడు పంత్.

టెస్టుల్లో 27వ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పంత్(Rishabh Pant) అధిగమించాడు. తద్వారా అత్యంత వేగవంతంగా ఈ ఫీట్ నమోదు చేసిన టీమిండియా కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. గతంలో ఈ రికార్డు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ తన 32వ ఇన్నింగ్స్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ 

 

 

 

టెస్టుల్లో రిషబ్ పంత్ 2 శతకాలు బాదడంతో పాటు 4 అర్ధశతకాలు సాధించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించడం ద్వారా వేగవంతంగా ఈ మైలురాయిని చేరుకున్నాడు పంత్. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నిర్ణయాత్మక నాలుగో టెస్టులో పంత్ పైనే టీమిండియా(Team India) ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ 2-1తో టీమిండియా కైవసం చేసుకోనుంది.

Also Read: Gold Price Today 19th January 2021: పెరిగిన బంగారం ధరలు.. 5 వేలు పుంజుకున్న వెండి 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News