India Open 2022: ఇండియా ఓపెన్ క్వార్టర్స్​లోకి ప్రవేశించిన సింధు... ఇంటిదారి పట్టిన సైనా..

India Open 2022: న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఇండియా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్ లోకి ప్రవేశించగా.. సైనా ఇంటిదారి పట్టింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 04:27 PM IST
  • ఇండియా ఓపెన్ లో కరోనా కలకలం
  • ఏడుగురు ఆటగాళ్లకు పాజిటివ్
  • క్వార్టర్స్ లోకి ప్రవేశించిన సింధు
India Open 2022: ఇండియా ఓపెన్ క్వార్టర్స్​లోకి ప్రవేశించిన సింధు... ఇంటిదారి పట్టిన సైనా..

India Open 2022: ఇండియా ఓపెన్ లో (India Open 2022) భారత స్టార్​ షట్లర్ పీవీ సింధు.. క్వార్టర్స్​లోకి ప్రవేశించింది. ప్రత్యర్థి ఇరా శర్మను 21-10, 21-10 తేడాతో ఓడించిన సింధు ( PV Sindhu) తదుపరి రౌండ్ కు చేరుకుంది. ఈ స్టార్ ప్లేయర్ మ్యాచ్ను కేవలం 30 నిమిషాల్లోనే ముగించింది. మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్  (Saina Nehwal)  టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండో రౌండ్​లో మాలవిక బన్సోడ్​ (Malvika Bansod) చేతిలో 21-17, 21-9 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ దాదాపు ​ 35 నిమిషాల పాటు జరిగింది. టోర్నీలో భాగంగా 2వ రౌండ్ మ్యాచ్ లు గురువారం (జనవరి 13) నుంచి ప్రారంభమయ్యాయి. 

టోర్నీలో కరోనా కలకలం..
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న​ టోర్నీలో భారత్​కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా (Covid-19) బారిన పడ్డారు. వారిలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రితికా ఠక్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ సింగ్, ఖుషీ గుప్తాలు ఉన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్​)  (Badminton World Federation) ధృవీకరించింది. టోర్నీలో కరోనా కేసులు నమోదైన కారణంగా ఇండియా ఓపెన్ 2022 నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన ఆటగాళ్లను ఐసోలేషన్ కు పంపడం సహా మిగిలిన ఆటగాళ్లకు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.  

Also Read: India Open 2022 Corona: ఇండియా ఓపెన్ లో కరోనా కలకలం.. ఏడుగురు షట్లర్లకు కొవిడ్ పాజిటివ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News