మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు సమకాలికుడిగా పేరున్న షాహీద్ ఆఫ్రిదీ గురించి ప్రపంచానికి తెలియని విషయం ఒకటి బయటపడింది. 16 ఏళ్లకే అంతర్జాతీయ కెరీర్ లో అదరగొడుతున్నాడని ప్రచారం చేశారు. అయితే అందంతా ఉత్తిదేనని తేలిపోయింది. వాస్తవానికి అప్పట్లో ఆఫ్రిదీ వసయస్సు 19 ఏళ్లట.. 'గేమ్ ఛేంజర్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని ఆఫ్రిది స్వయంగా వెల్లడించాడు.
1996లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో ఆఫ్రిదీ 37 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం రేపాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడని ప్రపంచం అంతా కోడై కూసింది. అంత్యంత పిన్నవయసుకే ఇలా సెంచరీ బాదాడని..అది కూడా ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన వీరుడని ఆఫ్రిదీ మీద పాక్ మీడియా కథనాల మీదే కథనాలు ప్రచురించింది. ఇవన్ని ఉత్తదేనని తేలిపోవడంతో ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు, ఆ దేశ మీడియా నాలుక కరుచుకుంటోంది.