మరోసారి 'సూపర్' విక్టరీ సాధించిన భారత్

స్కై స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ ల మధ్య  జరిగిన టీ20 మ్యాచ్‌ మొదట డ్రా గా ముగిసింది. టాస్‌ గెలిచిన న్యూజిల్యాండ్‌ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా

Last Updated : Jan 31, 2020, 07:22 PM IST
మరోసారి 'సూపర్' విక్టరీ సాధించిన భారత్

వెల్లింగ్టన్‌ : స్కై స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ ల మధ్య  జరిగిన టీ20 మ్యాచ్‌ మొదట డ్రా గా ముగిసింది. టాస్‌ గెలిచిన న్యూజిల్యాండ్‌ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా 165 పరుగులు చేసింది. మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో, మరోసారి మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది.

సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టానికి 13 పరుగులు చేసింది. 14 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, కేఎల్‌ రాహుల్‌-విరాట్ కోహ్లిలు సూపర్‌ ఓవర్‌ ఆడటానికి క్రీజ్‌లోకి వచ్చారు. తొలి రెండు బంతులకు సిక్స్‌, ఫోర్‌తో 10 పరుగులు సాధించిన రాహుల్‌.. మూడో బంతికి ఔటయ్యాడు. నాల్గో బంతికి కోహ్లి రెండు పరుగులు, ఐదో బంతికి బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. భారత్-న్యూజిలాండ్ ల మధ్య వరుస టీ20 మ్యాచుల్లో సూపర్ ఓవర్ లో భారత్ వరుస విజయాలు సాధించడం క్రికెట్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News