Trolls on Rishab Pant: ముంబై ఇండియన్స్ జట్టుపై ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ నుంచి ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. స్వయంకృతపరాధమే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కొంపముంచింది. ఇంకా చెప్పాలంటే... అంతా కెప్టెన్ రిషబ్ పంత్ వల్లే జరిగింది. కెప్టెన్‌గా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం... ఫీల్డింగ్ సమయంలో విలువైన క్యాచ్‌ను జారవిడవడం వల్ల ఢిల్లీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. పైగా కెప్టెన్‌గా తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు రిషబ్ పంత్ టీమ్ మేట్స్‌ను బ్లేమ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ వ్యవహారం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించడంతో సోషల్ మీడియాలో అతనిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
ముంబై బ్యాట్స్‌మ్యాన్ టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చి రాగానే ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్న బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి కీపర్ పంత్ చేతుల్లో పడింది. ఔట్ కోసం ఢిల్లీ టీమ్ అప్పీల్ చేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అయితే దీనిపై డీఆర్ఎస్‌కు వెళ్లాల్సిందిగా ఢిల్లీ ఆటగాడు సర్ఫరాజ్ పంత్ దగ్గరికి వెళ్లి మరీ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ పంత్ మాత్రం తల అడ్డంగా ఊపుతూ డీఆర్ఎస్‌కి నిరాకరించాడు.
టిమ్ డేవిడ్ బ్యాట్ ఎడ్జ్‌కి శార్దూల్ వేసిన బంతి టచ్ అయినట్లు ఆ తర్వాత రీప్లేలో స్పష్టంగా కనిపించింది. ఆ లైఫ్‌ని అందిపుచ్చుకున్న టిమ్ డేవిడ్ 4 సిక్సులు, 2 ఫోర్లతో కేవలం 11 బంతుల్లోనే 34 పరుగులు బాది ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంత్ రివ్యూకి వెళ్లకపోవడంతో ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకున్నట్లయింది. అయితే కెప్టెన్‌గా తన తప్పిదాన్ని పంత్ టీమ్ మేట్స్ పైకి నెట్టే ప్రయత్నం చేశాడు.
డేవిడ్ బ్యాట్‌కి బంతి ఎడ్జ్ అవడం తనకు క్లియర్‌గా వినిపించిందని.. కానీ టీమ్ మేట్స్ కాన్ఫిడెంట్‌గా లేకపోవడం వల్లే డీఆర్ఎస్‌కి వెళ్లలేదని మ్యాచ్ అనంతరం పంత్ చెప్పుకొచ్చాడు. పంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పంత్ పెద్ద అబద్దాలకోరు అని విమర్శిస్తున్నారు. డీఆర్ఎస్ కోసం సర్ఫరాజ్ ఎంతలా రిక్వెస్ట్ చేసినా వినిపించుకోని పంత్... తిరిగి టీమ్ మేట్స్‌నే బ్లేమ్ చేయాలనుకోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇదే మ్యాచ్‌లో పంత్ మరో బిగ్ మిస్టెక్ చేశాడు. ముంబై ఆటగాడు బ్రేవిస్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ లైఫ్‌తో బ్రేవిస్ రెచ్చిపోయి ఆడాడు. 3 సిక్సులు, 1 ఫోర్‌తో 33 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇలా పంత్ మిస్టెక్స్‌తో లైఫ్ పొందిన బ్రేవిస్, టిమ్ డేవిడ్ ఇద్దరూ ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించి ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలకు గండి కొట్టారు.
https://t.co/WnlMYeoJz9 pic.twitter.com/LS7oPoNoR0
— Abhay (@ImAbhay3) May 21, 2022
RCB fans watching Rishabh Pant's mistake: pic.twitter.com/D4Ev5zfNeO
— Kartik🔥 (@KaiseAanaHuaaa) May 21, 2022
Congratulations Rishabh Pant for winning the man of the match for RCB🥳🥳🎉 pic.twitter.com/v2gIsIozVs
— Arjun Tendulkar FC (@bestwicketkeper) May 21, 2022
Rishabh Pant should be given an honorary Infosys offer letter by Bangalore.
— Gabbbar (@GabbbarSingh) May 21, 2022
Also read: Facts About PV Sindhu: ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Rishab Pant: ఇదేంది పంతూ... చేసిందంతా చేసి టీమ్ మేట్స్‌ను నిందిస్తావా... రిషబ్ పంత్‌పై నెటిజన్ల ట్రోలింగ్
రిషబ్ పంత్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్
ఢిల్లీ కొంపముంచాడంటూ నెటిజన్ల మండిపాటు
పైగా టీమ్ మేట్స్‌ని నిందించడమేంటని నెటిజన్ల ఫైర్