ICC T20 World Cup 2021లో జరిగిన దాయాదులపోరులో పాకిస్తాన్ తొలి విజయం అందుకుని చరిత్ర తిరగరాసింది. అంతేకాదు క్రికెట్ ప్రేమికుల్ని ఈ మ్యాచ్ ఎంతగానో అలరించింది. ఆకట్టుకుంది. అందుకే నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అంపైర్‌పై మాత్రం మండిపడుతున్నారు. ఎందుకంటే..
టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup)టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. యావత్ క్రికెట్ ప్రేమికులకు ఈ మ్యాచ్ చాలా బాగా ఆకట్టుకుంది. ఆకర్షించింది. పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించినా రెండు జట్ల మధ్య అత్యంత సుహృద్భావ వాతావరణంలో మ్యాచ్ జరగడం, రెండు జట్లు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించడం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ గెలుపుతో టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) ఇండియాపై పాకిస్తాన్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్‌కు ముందు..తరువాత నెటిజన్ల కామెంట్లలో సైతం పరిణితి కన్పించింది. ఇండియా ఓడిపోవడంపై నిరాశ చెందినా..పాకిస్తాన్ ఆటగాళ్ల ఆట మాత్రం ఆకట్టుకుంది. అందుకే నెటిజన్లు చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
" ఇదీ క్రికెట్ అంటే..రెండు జట్లు మంచి ఆటుతీరు కనబరిచాయి. మ్యాచ్ మొత్తం ఒక్కసారి కూడా స్లెడ్జింగ్ లేకుండా పూర్తయిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మ్యాచ్ పూర్తవగానే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి..పాకిస్తాన్ ఓపెనర్ రిజ్వాన్‌ను హత్కుకున్న ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఈ పోటో ఎంతగానో నచ్చిందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ అయితే వినూత్నంగా ఫోటో కామెంట్ చేశాడు. ఇప్పటి వరకూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లపై(India Pakistan) వచ్చిన జోక్స్, మీమ్స్‌కు తెరపడిందని..రిప్ అంటూ కామెంట్ చేశాడు. పలువురు ఇండియన్ సెలెబ్రిటీలు కూడా కామెంట్లు చేశారు.ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌పై నెటిజన్ల స్పందన పాజిటివ్‌గానే ఉన్నా..కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై అంపైర్‌పై మండిపడుతున్నారు. అటు రోహిత్ శర్మపై మాత్రం విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(KL Rahul) అవుట్ వివాదాస్పదమైంది. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో రాహుల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే రీప్లేలో షాహీన్ అఫ్రిది నో బాల్ వేసినట్టు స్పష్టంగా కన్పిస్తోంది. అంపైర్ మాత్రం నో బాల్ ప్రకటించకపోవడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. అంపైర్ నిద్రపోతున్నాడా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటు రోహిత్ శర్మ డకౌట్ కావడంపై ఆతడిపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు.
Also read: India vs Pakistan Match: టీమ్ ఇండియా రికార్డు బ్రేక్ చేసిన పాకిస్తాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి