US Open 2020: ఉమెన్స్ సింగిల్స్ ఛాంపియన్‌గా నవోమి ఒసాకా

జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా (Naomi Osaka) యూఎస్ ఓపెన్ 2020 ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. నవోమి ఒసాకా బెలారస్‌ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా (Victoria Azarenka) ఓడించి రెండోసారి యూఎస్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 

Last Updated : Sep 13, 2020, 09:25 AM IST
US Open 2020: ఉమెన్స్ సింగిల్స్ ఛాంపియన్‌గా నవోమి ఒసాకా

US Open 2020 winner Naomi Osaka: న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా (Naomi Osaka) యూఎస్ ఓపెన్ 2020 ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. నవోమి ఒసాకా బెలారస్‌ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా (Victoria Azarenka) ఓడించి రెండోసారి యూఎస్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో ఉత్కంఠగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నవోమి ఒసాకా 1-6, 6-3, 6-3తో విక్టోరియా అజరెంకాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ 22ఏళ్ల ఒసాకా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలవడం ఇది రెండోసారి. Also read: US Open 2020: నల్ల కలువకు షాక్.. ఫైనల్‌కు అజరెంకా

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

A kiss earned by a comeback. 😘

A post shared by US Open (@usopen) on

గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదటి సెట్‌లో 1-6తో ఒసాకాను అజరెంకా సులువుగా ఓడించింది. ఆ తర్వాత వెంటనే పుంజుకున్న నవోమి ఒసాకా... రెండు, మూడు సెట్లను 6-3, 6-3తో అజెరెంకాను ఓడించింది. అయితే.. రెండు, మూడు సెట్లలో నవోమి ఒసాకాకి బ్రేక్ పాయింట్లు కలిసొచ్చాయి. ఇదిలా ఉంటే.. ఫైనల్‌లో మొదటి సెట్ ఓడిపోయి.. టైటిల్ గెలవడం చాలా ఏళ్ల తర్వాత మళ్లీ జరిగింది.  Also read: Ketika Sharma: కేతిక అందాలు అదరహో..

Trending News