MS Dhoni retirement: సాక్షి ఎమోషనల్ పోస్ట్

భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni  ) అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్ నుంచి శనివారం రిటైర్మెంట్ తీసుకుంటున్న‌ట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ధోని రిటైర్మెంట్ ( dhoni retirement ) తీసుకుంటున్నట్లు ప్రకటించగానే.. అభిమానులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Last Updated : Aug 16, 2020, 09:50 AM IST
MS Dhoni retirement: సాక్షి ఎమోషనల్ పోస్ట్

Sakshi Dhoni Shares Emotional Post: న్యూఢిల్లీ: భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni  ) అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్ నుంచి శనివారం రిటైర్మెంట్ తీసుకుంటున్న‌ట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ధోని రిటైర్మెంట్ ( dhoni retirement ) తీసుకుంటున్నట్లు ప్రకటించగానే.. అభిమానులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ మేరకు ధోనీ జీవిత భాగస్వామి సాక్షి ధోని ( Sakshi Dhoni ) కూడా ఒక ఎమోష‌న‌ల్ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ధోని సాధించిన ఘనతల గురించి ఆమె ప్రస్తావిస్తూ.. సాక్షి ఇలా రాశారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

You should be proud of what you have achieved. Congratulations on giving your best to the game. I am proud of your accomplishments and the person you are! I am sure you must have held those tears to say goodbye to your passion. Wishing you health, happiness and wonderful things ahead! #thankyoumsd #proud “People will forget what you said, people will forget what you did, but people will never forget how you made them feel.” — Maya Angelou

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

‘‘మీరు సాధించినదానికి గర్వపడాలి. ఆటలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ ఇచ్చినందుకు అభినందనలు. మీ గురించి నేను గర్వపడుతున్నాను. వీడ్కోలు పలుకుతున్న‌ప్పుడు.. మీరు కన్నీటిని ఆపుకోలేక‌పోయార‌ని నాకు తెలుసు. మీరు భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని రా‌శారు. అంతేకాకుండా ఆమె ప్రసిద్ధ అమెరికన్ కవి మాయ ఏంజెలో కవితను షేర్ చేశారు. ‘‘మ‌నం చెప్పిన దాన్ని.. చేసిన దాన్ని ప్రజలు మరచిపోతారు. కానీ మ‌నం జనానికి ఎలాంటి అనుభూతిని అందిస్తామో.. దానిని వారు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోరు’’ అని గుర్తుచేశారు. Also read: Dhoni Retirement: ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది

ఝార్ఖండ్ రాంచీకి చెందిన మహేంద్ర సింగ్ ధోని టీమ్ ఇండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా ముద్ర వేసుకున్నారు. తన కెప్టెన్సీలో జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించారు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007 టీ- 20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకుంది.  Sourav Ganguly: ధోనీ రిటైర్మెంట్ గురించి దాదా ఏమన్నాడంటే..

Trending News