Mohammed siraj: తనను దారుణంగా ట్రోల్స్ చేశారన్న యువ బౌలర్ మహ్మద్ సిరాజ్​!

Mohammed siraj: గతంలో తనపై కొందరు చేసిన విమర్శలను గుర్తు చేసుకున్నాడు టీమ్ ఇండియా పేసర్​ మహ్మద్ సిరాజ్​. ధోని చెప్పిన సలహాతో అలాంటి కామెంట్స్ పట్టించుకోవట్లేదని చెప్పాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 04:37 PM IST
  • తనపై వచ్చిన విమర్శలను గుర్తు చేసికున్న మహ్మద్ సిరాజ్​
  • గతంలో కొన్ని కామెంట్స్ బాధించాయని వెల్లడి
  • ధోని చెప్పిన సలహా బాగా పని చేసిందన్న యువ బౌలర్​
Mohammed siraj: తనను దారుణంగా ట్రోల్స్ చేశారన్న యువ బౌలర్ మహ్మద్ సిరాజ్​!

Mohammed siraj: మహ్మద్ సిరాజ్ ఐపీఎల్​తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు టీమ్ ఇండియా తరఫున కూడా తన సత్తా చాటుతున్న యువ బౌలర్​. హైదరాబాద్​కు చెందిన సిరాజ్​.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి రాగలిగాడు.

కెరీర్​ ఆరంభంలో అతడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాని తాజాగా గుర్తు చసుకున్నాడు సిరాజ్​. గతంలో తనపై సోషల్ మీడియాలో కొంత మంది చేసిన కామెంట్లు బాధించాయన్నాడు.

అయితే టీమ్​ ఇండియా మాజీ క్రికెటర్​ మహేంద్రసింగ్​ ధోని చెప్పిన మాటలు విన్న తర్వాత.. విమర్శల గురించి పట్టించుకోవడం మానేశానని తెలిపాడు.

సిరాజ్​కు ఎదురైన చేదు అనుభవం ఏమిటంటే..

2018 ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్​తో ఆడుతున్న సమయంలో.. తాను వరుసగా రెండు బీమర్లు వేశానని సిరాజ్ చెప్పాడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ చాలా మంది.. తనను ట్రోల్స్ చేశారని గుర్తు చేసుకున్నాడు సిరాజ్​. 'నువ్వు క్రికెట్​ వదిలేసి మీ నాన్నలాగే ఆటో నడుపుకో' కొంత మంది చేసిన కామెంట్స్ చూసి అప్పట్లో బాధ పడ్డట్లు చెప్పాడు.

అయితే టీమ్ ఇండియాకు సెలెక్ట్ అయినప్పుడు.. ​ధోని తనతో అన్న ఓ మాటను గుర్తు చేసుకున్నాడు సిరాజ్​. ఇవాళ రాణిస్తే నిన్ను అందరూ పొగుడుతారని.. అదే విఫలమైతే వాళ్లే నిన్ను విమర్శిస్తారని చెప్పినట్లు తెలిపాడు. అందుకే ఎవరీ మాటలు పట్టించుకోవద్దని సూచించినట్లు సిరాజ్​ వెల్లడించాడు.

ధోని అన్నట్లుగానే అప్పట్లో తనను దారుణంగా విమర్శించిన వాళ్లే ఇఫ్పుడు పొగుడుతున్నట్లు చెప్పాడు.

Also read: IND vs PAK T20 World Cup 2022: నిమిషాల్లో అమ్ముడుపోయిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు

Also read: Ahmedabad Titans: ఐపీఎల్ కొత్త టీమ్ పేరు 'అహ్మదాబాద్ టైటాన్స్'.. ప్రకటించిన సీవీసీ క్యాపిటల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter 

Trending News